అక్కడ రిపీట్ అవ్వట్లేదు రాజమౌళి

Update: 2017-03-22 05:21 GMT
బాహుబలిః ది బిగినింగ్ వచ్చినప్పుడు.. సినిమా కంటెంట్ కొత్తదే అయినప్పటికీ.. చాలా సీన్లు బ్లాకులూ రాజమౌళి ఇతర హాలీవుడ్ సినిమాల నుండి కాపీ కొట్టేశాడని అనేకానేక రూమర్లు వచ్చేశాయి. వాటిలో కొన్న నిజం కూడా. ఇప్పుడు రెండో పార్టు ట్రైలర్ వచ్చిన తరువాత కూడా అలాంటి రూమర్లే వస్తున్నాయి. అయితే వీటిపై రాజమౌళి ఏమంటున్నాడో తెలుసా?

నిజానికి హెర్కులెస్ సినిమాలో హీరో రొమ్ములు చూపిస్తూ ప్రవాహంలా ఎదురొస్తున్న బాణాలకు తన ఛాతిని ఎత్తి చూపిస్తాడు. సేమ్ అదే షాట్ మనం బాహుబలిః ది కంక్లూజన్ ట్రైలర్లో చూశాం. మరి ఇలా ఫారిన్ సినిమాలో నుండి షాట్లు ఎత్తేస్తే ఎలా బ్రదర్ అని రాజమౌళిని ప్రశ్నిస్తే.. ఒక క్లారిటీ ఇచ్చాడు. ''వార్ సినిమాలంటే ఇక అవే సీన్లు వస్తాయి. అలాంటివే తీయాల్సి వస్తాయి. మీరు మిగిలిన కంటెంట్ చూడాలి కాని.. ఆ షాట్ అలాగే ఉంది అంటే మాత్రం కష్టం'' అంటూ నిట్టూర్చాడు. అయితే ఇలా కాపీ షాట్ల గురించి అడగొద్దంటే మాత్రం కొందరు ఫీలవుతున్నారంతే.

మనం 300 లేదా ట్రాయ్ సినిమాలను చూశాం. రెండూ కూడా వార్ సినిమాలే. కాని వాటిలో ఒక్క షాటంటే ఒక్క షాట్ కూడా కాపీ కొట్టలేదే అంటున్నారు సినిమా క్రిటిక్స్. అలాగే అలగ్జాండర్ లేదా బెన్హర్ సినిమాలను తీసుకున్నా కూడా.. వాటిలో కూడా వార్ సన్నివేశాలున్నా.. ఒక్క షాట్ కూడా రిపీట్ అవ్వలేదు. మరి రాజమౌళి తీసిన బాహుబలి లో మాత్రం ఎలా రిపీట్ అవుతున్నాయ్ చెప్మా??

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News