రాజమౌళి రివ్యూ కూడా వచ్చేసింది

Update: 2018-02-12 10:45 GMT
సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోవడంతో ఈ రోజుల్లో చాలా మంది సినిమాలపై రివ్యూలు ఇవ్వడం మొదలు పెట్టారు. సినిమా వాళ్లు కూడా ఇతర సినిమాలపై పాజిటివ్ కామెంట్స్ చేయడం కామన్. అయితే స్టార్ డైరెక్టర్స్ కి కూడా సినిమాలు నచ్చితే వెంటనే స్పందిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి గత కొంత కాలం నుంచి ఇతర సినిమాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు.

సాధారణంగా తన జానర్ కి సంబందించిన కథ కాకపోయినప్పటికీ నచ్చితే జక్కన్న వెంటనే కామెంట్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా వరుణ్ తేజ్ తొలిప్రేమ గురించి రాజమౌళి ఒక షార్ట్ రివ్యూ వేశాడు. ప్రేమ కథలకు ఫ్యాన్ కాకపోయినప్పటికీ తొలి ప్రేమ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. దర్శకుడు వెంకీ అట్లూరి మొదటి సినిమా చాలా బాగా చేశాడు. వరుణ్ తేజ్ తన గుర్తింపును పెంచుకున్నాడు.

రాశి ఖన్నా నటన చాలా బావుంది. ప్రసాద్ గారికి అండ్ బాపు గారికి కంగ్రాట్స్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని రాజమౌళి పేర్కొన్నాడు. ఎప్పుడైనా సరే సింపుల్ గా సూపర్బ్ అని చెప్పే జక్కన్న ఈ సారి తొలిప్రేమ గురించి మాత్రం ఒక రివ్యూ ఇచ్చేశాడు. మరి తరువాత సినిమాలకు కూడా దర్శకదీరుడు ఇదే స్థాయిలో రివ్యూలు ఇస్తాడో లేదో చూడాలి.    
Tags:    

Similar News