బయటికి ఎలాంటి లీక్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా షూటింగ్ జరుపుకుంటున్న రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ రామోజీ ఫిలిం సిటీ లో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక యమహానగరికి బయలుదేరబోతోంది. అదేనండి కోల్కతాకు. సుమారు 40 రోజుల పాటు జరిగే షూట్ లో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు ఇద్దరూ పాల్గొనబోతున్నట్టు తెలిసింది. అవుట్ డోర్ లో తీస్తారా లేక అక్కడేధైనా ప్రత్యేకంగా సెట్ వేస్తారా లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
యాక్టర్స్ ఇంకా ఎవరెవరు ఉంటారు అక్కడి నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళే ప్లానింగ్ ఉందా వగైరా డీటెయిల్స్ కోసం ఇంకా వేచి చూడాలి. హీరొయిన్లు ఎవరు అనే సస్పెన్స్ ఇంకా వీడనే లేదు. అలియా భట్ - పరిణితి చోప్రా అంటూ రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి కాని ఇంకా క్లారిటీ లేదు.
ఏడాది చివరికంతా షూటింగ్ పూర్తి చేసే టార్గెట్ తో రాజమౌళి పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాడు. స్వతంత్రం రాక ముందు బ్యాక్ డ్రాప్ అనే లీక్ వచ్చినప్పటికీ కథకు సంబంధించి అంతకు మించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు. ఇప్పటికే చరణ్ - తారక్ ల విడివిడి ట్రాక్స్ షూట్ చేసిన జక్కన్న కోల్ కతాలో అధిక భాగం కాంబో ఎపిసోడ్స్ తీయబోతున్నట్టు తెలిసింది.
ప్రత్యేకంగా సినిమా పది నిమిషాల పాటు వచ్చే చేజింగ్ సీక్వెన్స్ ని హౌరా బ్రిడ్జ్ మీద తీసేందుకు ప్లానింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం. ఇందుకుగాను అనుమతుల కోసం ఆల్రెడీ అప్లై చేశారట. సో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది కాబట్టి వచ్చే ఏడాది వేసవిలో చూడటం దాదాపు ఖాయమే