పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు.. జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ...! అన్నాడు సుమతీ శతకకారుడు. తనయుడు పెద్ద గాయకుడిగా రాణిస్తూనే.. సంగీత దర్శకుడిగా అద్భుతాలే చేస్తున్నాడు. టాలీవుడ్ లో క్వాలిటీ మ్యూజిక్ డైరెక్టర్ గా తండ్రికి మించిన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. రీరికార్డింగులో తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఇంతకీ ఎవరాయన? అంటే ఎం.ఎం.కీరవాణి వారసుడు కాల భైరవ.
బాహుబలి-2లో దండాలయ్యా .. అరవింద సమేతలో పెనివిటి పాటలతో గాయకుడిగా మరో స్థాయి చూపించాడు. తర్వాత `మత్తువదలరా` సినిమాతో సంగీత దర్శకుడిగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు తన తమ్ముడు శ్రీసింహా నటించిన రెండో సినిమా తెల్లవారితే గురువారం కి కూడా సంగీతం అందించారు కాలభైరవ. ఇక ప్రీరిలీజ్ వేడుకలో బాబాయ్ రాజమౌళి.. డాడీ కీరవాణి సమక్షంలో వేదికపై వారసులు ఇరువురూ సందడి చేశారు. ఈ ఈవెంట్లో జక్కన్న ఎమోషన్.. కీరవాణి ప్రేమ గొప్పగా ఆవిష్కృతమయ్యాయి.
``మేము మామూలుగా చాలామంది నటులను చూస్తుంటాం. ఇది బాగుంది.. అది బాలేదు.. అని సులభంగా చెప్పేస్తుంటాం. కానీ మన ఇంట్లో పిల్లల విషయానికి వచ్చేసరికే టెన్షన్.. వాళ్లు కొంచెం బాగా చేసినా మురిసిపోతాం`` అంటూ కాలభైరవ- శ్రీసింహా గురించి రాజమౌళి ఎమోషన్ అయ్యారు. కాల భైరవ గురించి టెన్షన్ లేదు. ఎందుకంటే.. ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నోడి (శ్రీసింహ) గురించే కాస్త భయం. ఆ భయం కూడా మీరు పోగొడతారని ఆశిస్తున్నా.. అంటూ జనాలపై బాధ్యతను పెట్టారు. మన పిల్లలు కొంచెం బాగా చేసినా చాలా బావుందని భావిస్తామని రాజమౌళి అన్నారు.
ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ.. ``ఇది మా అబ్బాయి శ్రీసింహా రెండో సినిమా. మొదటి సినిమా అయినా.. రెండో సినిమా అయినా.. మూడో సినిమా అయినా దర్శకులు చెప్పింది విని స్టూడెంట్ లా నేర్చుకోవాలి.. అందుకే స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ ఆశీర్వదించేందుకు వచ్చారు. తండ్రులు రెండు రకాలు. గూగుల్ మ్యాప్ ఫాదర్... ఇంట్లోంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ప్రతీ ఒక్కటి చెబుతుంటారు. కానీ రెండో రకం మాత్రం.. కేవలం ఆల్ ది బెస్ట్.. కమ్ బ్యాక్ సేఫ్!! అని చెబుతారు. నేనూ అదే చెబుతాను`` అని అన్నారు. కెరీర్ మొదలు పెట్టినప్పుడు మా అబ్బాయిలు సింహా-భైరవకు అన్నీ చెప్పానని కీరవాణి అన్నారు.