ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్టీఆర్ పడిపోయాడట!

Update: 2021-12-27 09:28 GMT
ఒకప్పుడు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు డూప్ తోనే చేయించేవారు. రిస్కీ ఫైట్ సీన్స్ అయితే డూప్ తప్పనిసరిగా ఉండవలసిందే. కానీ చిరంజీవి దగ్గర నుంచి పరిస్థితి మారిపోయింది. హీరోలు డూప్ లేకుండా చేసినప్పుడే అభిమానులు ఆ యాక్షన్ సీన్లో రియాలిటీని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి డూప్ లేకుండా చేసేవారు. అలా చేసేటప్పుడు ఆయన గాయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక ఇప్పుడు హీరోలు కూడా యాక్షన్ సీన్స్ ను తామే చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. అందువలన వాళ్లు కూడా అప్పుడప్పుడు గాయాలతో కనిపిస్తున్నారు.

ఆ మధ్య ఎన్టీఆర్ తన ముంజేతికి కట్టు కట్టుకుని కనిపించారు. దాంతో ఎన్టీఆర్ కి ఏమైందనే వార్తలు హల్ చల్ చేశాయి. అయినా ఎన్టీఆర్ ఆ విషయాన్ని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో గాయపడి ఉంటాడనే టాక్ కూడా వినిపించింది. అది నిజమేననే విషయం తాజాగా రాజమౌళి మాటల వలన తెలిసింది. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే నేషనల్ మీడియాతో రాజమౌళి మాట్లాడారు.

'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం ఎన్టీఆర్ తో ఒక యాక్షన్ సీన్ ను ప్లాన్ చేశాము. రోప్ సాయంతో చేసే ఫైట్ అది. ప్లానింగ్ లో ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగినా ఎన్టీఆర్ కి ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎన్టీఆర్ చాలా వేగంగా వచ్చి కింద పడ్డారు. ఆయనకి దెబ్బ తగలకుండా క్రింద కూడా తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి. అయినా ఎక్కువ ఒత్తిడిని ఆపుకోవడానికి ఆయన ప్రయత్నించడం వలన ముంజేయికి గాయమైంది.

ఎన్టీఆర్ గాయపడటం వలన షూటింగును నెల రోజుల పాటు వాయిదా వేయవలసి వచ్చింది. ఆయన పూర్తిగా కోలుకున్న తరువాతనే మళ్లీ షూటింగును మొదలుపెట్టాము. ఇలా షూటింగు మొదలుపెట్టిన దగ్గర నుంచి చిన్న చిన్న గాయాలైనా ఎన్టీఆర్ గానీ .. చరణ్ గాని పెద్దగా పట్టించుకోకుండా, ఆ తరువాత చేయవలసిన సీన్స్ పై దృష్టి పెట్టేవారు. వాళ్లిద్దరి సహకారంతోనే నేను అనుకున్న సన్నివేశాలను అనుకున్నట్టుగా తీయగలిగాను. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ వెనుక ఎమోషన్ ఉంటుంది. వాళ్లు ఆ సీన్స్ ను ఎంతలా పండించారనేది సినిమా చూశాక తెలుస్తుంది" అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News