అపజయం లేని దర్శకుడు రాజమౌళి ప్రతి సినిమాలో ఎదో ఒక అంశాన్ని చాలా మంది వాడుకుంటారు. సినిమా వాళ్లకు ఇది మాములే అయినా అన్ని సార్లు వర్కౌట్ కాకపోవచ్చు. ఏం చేసినా సినిమా హైప్ కోసమే.. కానీ హిట్టు ఫార్ములాని మళ్లీ వాడుకుంటే ఆడియెన్స్ బోరింగ్ గా ఫీల్ అవుతారు. ఈ విషయం కొంత మంది సినిమా వాళ్లకు ఎక్కువగా తెలియకపోవచ్చు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. గత కొంత కాలంగా ఒక సినిమా ప్రమోషన్స్ చాలా బాగా చేస్తోంది.
జూవ్వా అనే సినిమా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాపై అంచనాలు ఎక్కువగా పెరగలేదు గాని తప్పకుండా రిలీజ్ తరువాత అందరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. అందుకే మెగాస్టార్ వంటి వారిని సినిమా కోసం వాడేస్తున్నారు. అయితే ఈ సినిమాకు మొదట జువ్వ అనే టైటిల్ ను సెట్ చేయలేదట. రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాలోని జింతాత త అనే సాంగ్ ఎంతగా హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే మొదట్లో జువ్వ నిర్మాతలు తమ చిత్రానికి జింతాత త అని పేరు పెట్టాలని అనుకున్నారు.
ఈ చిత్ర దర్శకుడు త్రికోటి ఇంతకుముందు రాజమౌళి సినిమాలకు సహాయ దర్శకుడిగా వర్క్ చేశాడు. అయితే రాజమౌళి ఆ టైటిల్ వద్దని చెప్పడం వల్ల మార్చేశారు. అది సరదా పథమని టైటిల్ అలా పెడితే ఆడియెన్స్ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పడంతో దర్శకనిర్మాతలు వేరే టైటిల్ ని సెట్ చెసుకున్నట్లు సమాచారం. ఇక జువ్వ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఎమ్ఎమ్.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.