మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తారస్థాయిలో ఉన్న అంచనాలను అందుకుంటూ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాలో సినిమాటిక్ లిబర్టీపై విమర్శలు వచ్చినా చారిత్రక కథాంశానికి మసాలా అద్దకంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పనితనానికి వందశాతం మార్కులు వేశారు. గూస్ బంప్స్ తెచ్చేలా తెరకెక్కించారన్న ప్రశంసలు దక్కాయి. అందుకే `బాహుబలి`తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి సైతం సైరా సినిమాను .. మెగాస్టార్ నటనను .. సురేందర్ రెడ్డి ప్రతిభను ప్రశంసలతో ముంచెత్తారు. నిర్మాత రామ్ చరణ్ ని మెచ్చుకున్నారు.
``చరిత్రకారుడు ఉయ్యలవాడ నర్సింహారెడ్డి పాత్రకు మెగాస్టార్ చిరంజీవిగారు జీవం పోశారు. చరిత్ర మరిచిపోయిన వ్యక్తిని స్మరణకు తెచ్చారు. జగపతిబాబు- కిచ్చ సుదీప్- విజయ్ సేతుపతి- నయనతార- తమన్నా.. ఇలా ప్రతి పాత్ర కథలో భాగమవుతూ మరింత ఆసక్తిని కలిగించాయి. చక్కని విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. రామ్ చరణ్ కు హృదయపూర్వక అభినందనలు``అని రాజమౌళి ట్వీట్ చేశారు.
ఎస్.ఎస్.రాజమౌళి సహా సెలబ్రిటీ ప్రపంచం నుంచి మెగాస్టార్ పైనా .. సురేందర్ రెడ్డి- రామ్ చరణ్ లపైనా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక తొలిరోజు వసూళ్ల వివరాలు ఇప్పటికే రివీలయ్యాయి. తొలి వీకెండ్ వసూళ్ల రికార్డులు ఎలా ఉండనున్నాయి? అన్నది వేచి చూడాల్సిందే.