ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ వాతావరణంలో ఉన్నారు. తొలిరోజే జనతా గ్యారేజ్ చూసేద్దాం అని బాక్సాఫీసుల వద్ద నిన్నటి నుంచే బారులు తీరడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ అభిమానుల్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళీ కూడా ఒకరు! గతంలో సింహాద్రి - యమదొంగ వంటి మాంచి మాస్ మసాలా చిత్రాలను తారక్ తో చేశారు జక్కన్న. అప్పటి నుంచీ ఈ ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడింది. తారక్ నటన - డాన్స్ అంటే జక్కన్నకు చాలా ఇష్టం. కాబట్టి, సహజంగానే ఎన్టీఆర్ అంటే ఇష్టమూ అభిమానమూ ఉన్న జక్కన్న తొలిరోజే తొలి ఆట చూసేశారు. అయితే, ఆసినిమాను ఒక్కసారి చూస్తే రొటీన్. ఈ చిత్రాన్ని జక్కన్న రెండుసార్లు చూడటం విశేషం. ఒక షో పూర్తయిన వెంటనే... ఆ తరువాతి షోకి కూడా టిక్కెట్ తీసుకుని జక్కన్న చూసేశారు. అంటే, బ్యాక్ టు బ్యాక్ షోలు చూశారన్నమాట. తారక్ వీరాభిమానులు కూడా బహుశా ఒక షో చూసి సంతృప్తి పడతారని చెప్పుకోవచ్చు. కానీ, జక్కన్న ఇలా రెండు షోలు చూశారంటే... ఎంత అభిమానమో చూడండి. తొలిసారి చూస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో... రెండోసారి కూడా అదే స్థాయిలో ఆనందించారట.
తన ట్విట్టర్ లో ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు జక్కన్న. జనతా గ్యారేజ్ చిత్రాన్ని బ్యాక్ టు బ్యాక్ వరుసగా రెండుసార్లు చూశానని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో తారక్ నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. పరిపక్వమైన నటనను ప్రదర్శించాడు అన్నారు. ఎన్టీఆర్ - మోహన్ లాల్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారని పేర్కొన్నారు. ఈ ఇద్దరి మధ్యా సాగిన సన్నవేశాలు ఉద్వేగభరితంగా ఉన్నాయన్నారు. టెంపర్ సినిమా తరువాత తన కెరీర్ పంథాను మార్చుకున్న తారక్ తీరును జక్కన్న ప్రశంసించారు. సో... ఈ ట్వీట్ చూడగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బోలెడంత ఆనందం కలుగుతుంది అని వేరే చెప్పాలా..?