మార్కెటింగ్ అనే పదానికి పర్ఫెక్ట్ క్రియేటివ్ సినానిమ్ ఎవరైనా ఉన్నారా అంటే.. తెలుగు దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి. అందుకే తన సత్తా అంతా వాడేసి బాహుబలి సినిమాకు ఆ రేంజ్ హైప్ తెప్పించడంలో దిగ్విజయం సాధించేశాడు. దాదాపు ఎటువంటి అవకాశాన్ని కూడా వదలకుండా.. సినిమా తాలూకు పోస్టర్లు.. కామిక్ బుక్స్.. ఇప్పుడు కొత్తగా వర్చువల్ రియాల్టీ అనుభవం అంటూ బాహుబలి 2 కోసం చాలా గాట్టిగానే ప్రచారం చేస్తున్నాడు.
అయితే మొన్నామధ్యన బెంగుళూరులో స్వార్డ్ ఆఫ్ బాహుబలి అంటూ ఒక ఈవెంట్ పెట్టి అక్కడ బాహుబలి వర్చువల్ రియాల్టీ టీజర్ ను చాలామంది చూపించారు. మరి తెలుగు జనాలు చూడ్డానికి హైదరాబాద్ లో ఎప్పుడు ఈ టీజర్ చూపిస్తారంటూ ఫ్యాన్స్ అందరూ గోల చేస్తున్న నేపథ్యంలో.. ఈరోజు నుండి హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో బాహుబలి వి.ఆర్. టీజర్ చూసే వీలు కల్పించారు. అక్కడే స్వార్డ్ ఆఫ్ బాహుబటి స్టాల్ ను ఏర్పాటు చేశారు.
మామూలుగా వేరే ఏదైనా హాలిడే టైమ్ లో ఈ స్టాల్ పెట్టడం ఒకెత్తు.. కరక్టుగా ఖైదీ నెం 150 రిలీజవుతూ.. ఎన్నడూ లేని విధంగా ప్రసాద్ ఐమ్యాక్స్ వారు 33 షోలను ఒకే సినిమాకు కేటాయించి హౌస్ ఫుల్స్ బోర్డును పెట్టేసిన వేళ.. ఈ స్టాల్ ఏర్పాటు చేయడంతో.. అక్కడ సందర్శకుల తాకిడి విపరీతంగా ఉంది. మొత్తానికి రాజమౌళి టైమింగే టైమింగు కదూ. ఖైదీని పర్ఫెక్ట్ గా వాడేశారంతే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/