సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దరువు శివ (సిరుత్తై శివ) ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తళా అజిత్ తో వరుసగా నాలుగు సినిమాలు చేసిన శివ తొలిసారి సూపర్ స్టార్ రజనీ కాంత్ ని డైరెక్ట్ చేస్తున్నారు. `అన్నేటె` అనేది ఈ సినిమా టైటిల్. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. 2021 సంక్రాంతి కి రిలీజ్ చేయాలన్నది ప్లాన్.
అయితే అందరికీ పంచ్ ఇచ్చినట్టే రజనీకి మహమ్మారీ బిగ్ పంచ్ ఇచ్చింది. చెన్నై సహా తమిళనాడులో వైరస్ విజృంభణ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం చిత్ర యూనిట్ కి సమస్యాత్మకంగా మారింది. తమిళనాడు ప్రభుత్వం బెంబేలెత్తే సన్నివేశంలో ఉందిప్పుడు. దేశవ్యాప్తంగా అన్ లాక్ 1.0 అమల్లో ఉన్నా.. స్వీయ నియంత్రణ కోసం మరోసారి తమిళ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.
రాష్ట్రంలోని అనేక నగరాల్లో అకస్మాత్తుగా లాక్ డౌన్ అమల్లోకి తేవడంతో రజనీ యూనిట్ కి పెద్ద చిక్కులొచ్చిపడ్డాయి. సాధ్యమైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని భావించినా వీలుపడలేదు. తాజా సన్నివేశం చూస్తుంటే 2021 సంక్రాంతి రిలీజ్ కూడా కష్టమేనని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జనవరి 2021 కి వాయిదా వేశారు. అప్పటికి వీలు పడదు. 2021 వేసవిలో మాత్రమే రిలీజయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అప్పటికి రావాలన్నా ఇప్పుడే షూటింగ్ ను ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ సెప్టెంబర్- అక్టోబర్ నాటికి మహమ్మారీ ఇంకా భీకరంగా విజృంభిస్తుందన్న అంచనాలున్నాయి. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుందేమో!