సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాతే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా నిలిచి పోయింది. షూటింగ్ మద్యలో ఆగిపోయిన ఈ సినిమాను పునః ప్రారంభించాలని దర్శకుడు భావిస్తున్నాడు. కాని రజినీకాంత్ ఆరోగ్యం దృష్ట్యా ఈ ఏడాది అంతా కూడా షూటింగ్లో పాల్గొనకూడదు అని ఇప్పటికే అనుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను షూటింగ్ కు వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్న కారణంగా ఈ ఏడాది మొత్తం కూడా కెమెరాకు దూరంగా ఉండబోతున్నారు.
అన్నాతే సినిమా షూటింగ్ ను దర్శకుడు వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉందట. రజినీకాంత్ లేకుండా నయనతార.. కీర్తి సురేష్.. ఖుష్బులు ఇంకా ముఖ్య నటీనటులతో షూటింగ్ చేయబోతున్నారు. దాదాపుగా 30 నుండి 35 రోజుల వరకు ఈ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. మిగిలిన బ్యాలన్స్ షూటింగ్ ను 2021 జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తి చేయబోతున్నారు. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నాడట. రజినీకాంత్ లేకుండా షూటింగ్ ను చేయడంతో పాటు డబ్బింగ్ మరియు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా పూర్తి చేసి వచ్చే ఏడాదిలో రజినీకాంబో సీన్స్ చిత్రీకరించి స్పీడ్ గా విడుదల చేయాలని శివ ప్లాన్ గా చెబుతున్నారు.