విలన్ గా చేయడానికి నేను రెడీ: రాజశేఖర్

Update: 2022-01-14 04:30 GMT
రాజశేఖర్ తన కెరియర్లో ఇంతవరకూ 90 సినిమాలను పూర్తి చేశాడు. 91వ సినిమాగా 'శేఖర్' రూపొందుతోంది. ఈ సినిమాకి జీవిత దర్శకత్వం వహిస్తుండగా .. రాజశేఖర్ కూతురు పాత్రలో శివాని నటిస్తుండటం విశేషం. ఇది మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన 'జోసెఫ్' సినిమాకి రీమేక్. ఈ సినిమాలో ఆయన రిటైర్మెంట్ తీసుకున్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని కీలకమైన కేసుల విషయంలో డిపార్టుమెంటు ఆయన సహకారాన్ని తీసుకుంటూ ఉంటుంది. అలా ఆయన ముందుకు ఒక కేసు వస్తుంది. ఆ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే కథ.

ఈ సినిమాను గురించి రాజశేఖర్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకి .. ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి నా లుక్ చూసిన వాళ్లంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉందని అంటున్నారు. లుక్ మాత్రమే కాదు .. తెరపై ఈ పాత్ర బాడీ లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో శివాని ఒక కీలకమైన పాత్ర చేస్తోంది. ఈ సినిమా ఆమె కెరియర్ కి ప్లస్ అవుతుందని అనుకున్నాము. కానీ 'అద్భుతం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని తనే ఈ సినిమాకి ప్లస్ అయింది.

నా సినిమాల్లో 'గరుడ వేగ'కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సినిమాలో అన్నీ కూడా బాగా కుదిరాయి. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్ర కావడం వలన జనంలోకి బాగా వెళ్లింది. ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుందని అంతా అంటున్నారు. త్వరలోనే 'గరుడ వేగ 2' చేసే అవకాశం ఉంది. అందుకు తగిన కథ సెట్ కావలసి ఉంటుంది. ఇక విలన్ రోల్స్ చేయవచ్చుగదా అని చాలామంది అడుగుతున్నారు. నాక్కూడా విలన్ రోల్స్ చేయాలనే ఉంది. తెరపై నన్ను నేను విలన్ గా చూసుకోవాలనే ఉంది. మంచి పవర్ఫుల్ విలన్ పాత్ర కోసమే వెయిట్ చేస్తున్నాను.

గతంలో 'ధృవ' సినిమాలో విలన్ రోల్ కోసం వెతుకుతున్నారని తెలిసి, అల్లు అరవింద్ గారిని అడగడం కూడా జరిగింది. ఆ పాత్రకి నేను సెట్ అవుతానని నాకు అనిపించింది. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఆ రోల్ అరవింద్ స్వామికి వెళ్లింది. ఇప్పుడు కూడా అలాంటి ఒక విలన్ రోల్ వస్తే చేయాలనే చూస్తున్నాను. మరి ఎప్పుడు వస్తుందో .. ఎవరు ఇస్తారో చూడాలి. ఇక 'శేఖర్' విషయానికి వస్తే ఈ సినిమాను నా పుట్టినరోజైన ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నాము" అని చెప్పుకొచ్చారు.         
Tags:    

Similar News