కోలీవుడ్ ఎంట్రీకి కూతురు రెడీ

Update: 2017-06-15 04:27 GMT
సీనియర్ హీరో రాజశేఖర్.. మాజీ హీరోయిన్ జీవితల కూతురు శివాని.. హీరోయిన్ గా అరంగేట్రం చేస్తుందనే వార్తలు చాలాకాలం నుంచే వినిపిస్తున్నాయి. తాను చిన్నప్పటి నుంచి అమ్మానాన్నల యాక్టింగ్ చూస్తూ పెరిగానంటున్న శివాని.. అప్పటి నుంచి తనకు నటనపై మక్కువ ఉండేదని అంటోంది.

'నేను భరతనాట్యం.. కూచిపూడి నేర్చుకున్నా. క్లాసికల్ సింగింగ్ కూడా నేర్చుకున్నాను. గిటార్.. కీబోర్డ్.. వీణ శిక్షణ పొందాను.. నన్ను నేను ఫిట్ గా ఉంచుకునేందుకు రోజూ జిమ్ కి తప్పనిసరిగా వెళతాను. నా సన్నిహితులు నన్ను ఫిట్నెస్ ఫ్రీక్ అంటార'ని చెబుతోంది శివాని. 'నాకు స్కూల్ డేస్ నుంచే తెలుగు.. తమిళ సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత నాకు మెడిసిన్ లో సీటు వచ్చింది. ఇప్పుడు 3వ సంవత్సరం. అది పూర్తయ్యాక సినిమాల్లో చేయాలని నా ప్లాన్ '' అంటోంది. ''చెన్నైలో పుట్టి హైద్రాబాద్ లో పెరిగిన అమ్మాయిని నేను. తమిళ్ సినిమాలు బాగా చూస్తాను. ధనుష్.. విశాల్.. విజయ్ సేతుపతి నా ఫేవరేట్స్'' అని చెబుతోంది ఈ స్టార్ డాటర్.

శివాని తమిళ్ మూవీస్ తో తెరంగేట్రం చేయనుందనే వార్తలపై శివాని తల్లి జీవిత స్పందించింది. 'తమిళ చిత్రాలు నాకు పేరు గుర్తింపు తెచ్చాయి. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా.. తమిళ్ లో హీరోయిన్ పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుకే కోలీవుడ్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం' అని చెప్పారు జీవిత. ప్రస్తుతం శివానిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడంపై.. లింగుస్వామి.. విశాల్.. గౌతమ్ మీనన్ లతో చర్చలు జరుపుతున్నట్లు టాక్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News