30 కోట్లలో రాజశేఖర్ వాటా ఎంత?

Update: 2017-10-29 01:30 GMT
తన మార్కెట్ బాగా దెబ్బ తిన్న సమయంలో ‘గరుడ వేగ’ సినిమాకు ఏకంగా రూ.25 కోట్లు పెట్టే నిర్మాత దొరికాడంటూ ఆశ్చర్యంగా చెప్పాడు రాజశేఖర్ ఇంతకుముందు. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో అయితే బడ్జెట్ రూ.25 కోట్లు కూడా కాదు.. రూ.30 కోట్లని ప్రకటించింది రాజశేఖర్ సతీమణి జీవిత. ఐతే వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర్ మార్కెట్ ప్రకారం ఇప్పుడు రూ.10 కోట్లు పెట్టడమూ రిస్కే. కంటెంట్ చాలా బాగుంటే 10-15 కోట్ల మధ్య ఖర్చు చేసి రిస్క్ చేయొచ్చు. కానీ ఏకంగా రూ.30 కోట్లు పెట్టడమన్నది ఊహకందని విషయం. ఓ కొత్త నిర్మాత మరీ ఈ స్థాయిలో ఖర్చుకు ముందుకు రావడం ఆశ్చర్యమే.

ఐతే నిర్మాతగా కోటేశ్వరరాజు పేరు పడ్డప్పటికీ ఈ చిత్రంలో రాజశేఖర్ పెట్టుబడి కూడా ఉందన్న సంకేతాలు అందుతున్నాయిప్పుడు. ఈ సినిమా ట్రైలర్లోనే రాజశేఖర్ సొంత బేనర్ పేరు పడటం గమనించే ఉంటారు. పైగా ‘గరుడవేగ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్ మాట్లాడుతూ జీవిత తమ్ముడు మురళికి ఆరోగ్యం విషమంగా ఉందని.. అతను ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ కూడా అని వెల్లడించాడు. ఈ సినిమాలో రాజశేఖర్ భార్యాపిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే ఇందులో వాళ్ల పెట్టుబడి కూడా ఎంతో కొంత ఉన్నట్లే కనిపిస్తోంది. గత కొన్నేళ్లలో రాజశేఖర్ బయటి బేనర్లకు చేసిన సినిమాల్లోనూ వాళ్ల పెట్టుబడులున్నాయి. వాటి వల్ల బాగానే నష్టపోయాడు రాజశేఖర్. మరి ‘గరుడవేగ’లో ఆయన వాటా ఎంత ఉందో.. ఈ సినిమా వాళ్లకు ఆర్థికంగా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
Tags:    

Similar News