స్టార్ కిడ్స్ కు అదే పెద్ద ఛాలెంజ్

Update: 2018-02-06 05:12 GMT
వారసత్వం అన్నది ఫిలిం ఇండస్ర్టీలో ఎప్పటి నుంచే ఉన్నదే. కానీ వారసులుగా పరిచయం అయ్యేవారిలో హీరోలే ఉంటారు. హీరోయిన్లుగా రాణించేవారిలో ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు చాలా తక్కువే ఉంటారు. బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ చాలామంది యాక్టింగ్ లోకి రావడమే కాదు.. స్టార్లుగా సక్సెస్ అయ్యారు. తెలుగులోనూ ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నట్టు కనిపిస్తోంది.

సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని 2 స్టేట్స్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతోంది. శివాని సినిమాల్లోకి రావడానికి ఏడాది క్రితమే డిసైడయినా ఏ సినిమాతో అడుగు మొదలు పెట్టాలన్నది నిర్ణయించుకోవడానికి చాలా టైమే పట్టింది. ‘‘సాధారణంగా ఇండస్ట్రీలో పాపులర్ అయిన వారి కుమార్తెలను హీరోయిన్ గా తీసుకోవాలని ఎవరైనా అనుకున్నా ఏ పాత్రలు ఆఫర్ చేస్తే వాళ్ల తల్లిదండ్రులకు ఏమనుకుంటారో అన్న భయంతో చాలామంది అసలు ముందుకే రారు. కనీసం ముందుకొచ్చి కథేమిటో చెప్పడానికి కూడా ఇబ్బంది పడిపోతారు. నాకు తెలిసీ నాలాంటి అమ్మాయిలకు ఇదే పెద్ద ఛాలెంజ్’’ అంటోంది లేటెస్ట్ స్టార్ కిడ్ శివాని.

‘‘నా కూతుళ్లు జీవితంలో ఏమి కావాలనుకుంటున్నారో చెప్పినప్పుడు దానికి నేను నో చెప్పలేను. నేను యాక్టర్ కావాలని అనుకున్నప్పుడు మా నాన్న అందుకు నిరాకరించినప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు గుర్తుంది. అందుకనే నా కుమార్తెల కలలకు అడ్డం పడాలని ఎప్పుడూ అనుకోను’’ అంటూ తండ్రిగా తన మనసులోని మాట చెబుతున్నాడు రాజశేఖర్. హీరోగా కెరీర్ ప్రారంభించడానికి ముందు రాజశేఖర్ ఎంబీబీఎస్ చేశాడు. తండ్రి నటననే కాదు.. చదువునూ వారసత్వంగా పుణికిపుచ్చుకున్న శివాని కూడా మెడిసిన్ చదువుతోంది.

ఫేమస్ ఇండియన్ రైటర్ చేతన్ భగత్ రాసిన టు స్టేట్స్ నవల ఆధారంగా శివాని నటించే టు స్టేట్స్  సినిమా తెరకెక్కుతోంది. హిందీలో ఈ సినిమా హీరోహీరోయిన్లుగా ఆలియాభట్-అర్జున్ కపూర్ నటించారు.

Tags:    

Similar News