ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ క్యారెక్టర్లకు రాజశేఖర్ మారు పేరు. మళ్లీ అదే లుక్ తో చాలాకాలం తర్వాత ఇప్పుడు ఇంకో సినిమా చేశాడు. గుంటూర్ టాకీస్ ఫేం డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పి.ఎస్.వి. గరుడవేగ 126.18 ఎం సినిమాలో నటించాడు. ఈ సినిమాను దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం టాలీవుడ్ ను ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ సందర్భంగా సినిమా కోసం ఏ రేంజిలో కష్టపడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు రాజశేఖర్. ‘‘ప్రవీణ్ సత్తారు వచ్చి ఈ సినిమా స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు ఇదంతా తెరపై చూపించగలరా అనే డౌట్ వచ్చింది. అదే మాట ఆయనను అడిగితే పేపర్ పై రాసినదంతా తెరపై చూపిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. నేను కూడా గొప్పగా చెప్పాలన్న ఉద్దేశంతో వందేమాతరం - ప్రతిఘటన - ఆహుతి - అంకుశం సినిమాల్లో ఎలా పరిగెత్తానో.. ఎలా పల్టీలు కొట్టానో ఇప్పుడు చేయగలనని అనేశాను. ఆ తర్వాత నా జీవితంలో ఇంతవరకు పడని కష్టాలన్నీ పడ్డాను. ఇప్పుడు కిందకి వంగితే నిల్చోలేని పరిస్థితి. అంత బెండు తీశాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎన్ని పాట్లు పడ్డానో మీరే చెబుతారు’’ అంటూ తను పడ్డ కష్టాలు చెప్పుకొచ్చాడు హీరో రాజశేఖర్.
ప్రేక్షకులను మెప్పించడం కోసం ఎంతటి సాహసమైనా చేస్తామంటూ సాధారణంగా హీరోలు డైలాగులు చెబుతుంటారు. కానీ యంగ్ ఏజ్ లో చేసిన సాహసాలు అన్ని వేళలా చేయడమంటే కష్టమే కదా. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో మెప్పించమడంటే మరీ కష్టం. ఒక్కసారి కమిట్ అయినందుకు డైరెక్టర్ రాజశేఖర్ కు చుక్కలు చూపించాడన్న మాట. గొప్పకు పోతే తిప్పలు తప్పవు మరి.