యాంగ్రీ హీరో రాజశేఖర్ `కల్కి` షూటింగ్ లో తలమునకలుగా ఉన్న సంగతి తెలిసిందే. పిఎస్‌వి గరుడవేగ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజశేఖర్ ఎంతో పట్టుదలగా ఆచితూచి ఎంచుకున్న స్క్రిప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ లో బ్యాడ్ ఇన్సిడెంట్. రాజశేఖర్ కు ఊహించని ప్రమాదంలో గాయాలయ్యాయని తెలుస్తోంది. ఆయన సేఫ్ .. మొండి పట్టుదలతో షూటింగ్ లో పాల్గొనడం చర్చకొచ్చింది.
ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? అంటే.. రాజశేఖర్- విలన్ల బృందంపై ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. లోడ్ చేసిన తుపాకీని ఫైర్ చేయాల్సిన సీన్ అది. అందులో భాగంగా ఆన్ లొకేషన్ గన్ ఫైర్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సీన్ లో గన్ మిస్ ఫైర్ అయ్యిందిట. రాజశేఖర్ తలకు - భుజానికి బలమైన గాయాలు అవ్వడంతో దర్శకనిర్మాతలు తనని ఆస్పత్రికి వెళ్లాలని - విశ్రాంతి తీసుకోమని అన్నారట. కానీ అంత పెద్ద గాయాలు అయినా అదేమీ కేర్ చేయకుండా షూటింగ్ పూర్తి చేసి వెళ్లారని తెలుస్తోంది. ఆయన డెడికేషన్ కి యూనిట్ ముచ్చటపడినా కాస్తంత కంగారు పడ్డారట.
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సి.కళ్యాణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా - రాజశేఖర్ కుమార్తెలు శివానీ - శివాత్మిక నిర్మాతలుగా కొనసాగుతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 1980 కాలంలో సాగే కాప్ డ్రామా ఇదని ప్రచారం సాగుతోంది. ఇదివరకూ రిలీజ్ చేసిన ప్రీలుక్ కి చక్కని స్పందన వచ్చింది.