రాజశేఖర్.. ఒకటి కాదు రెండు

Update: 2018-02-03 02:30 GMT
దశాబ్దానికి పైగా విరామం తర్వాత.. తన ఉనికినే అందరూ మరిచిపోయిన సమయంలో ‘గరుడ వేగ’తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు సీనియర్ హీరో రాజశేఖర్. ఆయన పునరాగమనాన్ని ఫీనిక్స్ పక్షి శిథిలాల నుంచి పైకి లేచిన వైనంతో పోల్చారు చాలామంది. ‘గరుడ వేగ’ కమర్షియల్ గా అంత సక్సెస్ కాకపోయినా.. మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. కొన్నాళ్ల పాటు చర్చల్లో నిలిచింది. ఆర్థికంగా సినిమా నష్టాలు తెచ్చినా.. రాజశేఖర్ కెరీర్ కు మళ్లీ గొప్ప ఉత్సాహాన్నయితే ఇచ్చింది. ఈ ఊపును ఆయన ఎలా కొనసాగిస్తాడు.. ఎలాంటి సినిమాల్ని ఎంచుకుంటాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంకో రెండు రోజుల్లోనే రాజశేఖర్ తన తర్వాతి సినిమాను ప్రకటించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న.. అంటే ఈ ఆదివారం రాజశేఖర్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా రాజశేఖర్ ఒకటికి రెండు కొత్త సినిమాల్ని అనౌన్స్ చేయబోతున్నాడట. మణిరత్నం దగ్గర పని చేసిన గోపీ అనే కొత్త దర్శకుడితో రాజశేఖర్ తర్వాతి సినిమా ఉంటుందని సమాచారం. ఇది ‘గరుడవేగ’ లాగే వైవిధ్యంగాఉంటుందట. దీంతో పాటు రాజశేఖర్ మరో సినిమా కూడా కమిటయ్యాడని.. దాన్ని కూడా పుట్టిన రోజు నాడు ప్రకటిస్తారని అంటున్నారు. ఈ రెండు సినిమాల్లో రాజశేఖర్ ఫ్యామిలీ నిర్మాణ భాగస్వామ్యం ఉంటుందట. ఈ సినిమాల పూర్తి వివరాల కోసం ఇంకో రెండు రోజులు ఆగాలి.
Tags:    

Similar News