సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కెరీర్ స్పీడ్ గురించి తెలిసిందే. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు అయ్యాకా అదే స్పీడ్. 1977లో స్నేహం అనే సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన రాజేంద్రుడు కామెడీ హీరోగా మూడున్నర దశాబ్ధాలు పైగానే అలరించారు. దాదాపు 250 పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం నటకిరీటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా క్షణం తీరిక లేనంత బిజీ. నవతరం దర్శకులతో ఎలాంటి భేషజం లేకుండా సింక్ అయ్యి పని చేయడం ఆయన స్టైల్. అందుకే ఇంత బిజీయెస్ట్ నటుడిగా కొనసాతున్నారు. ఈ ఏడాది ఏకంగా నాలుగు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. మహేష్-అనీల్ రావిపూడిల `సరిలేరు నీకెవ్వరు`.. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే క్రికెట్ నేపథ్యంలోని `కౌశల్య కృష్ణమూర్తి` చిత్రంలో తండ్రి పాత్రను పోషిస్తున్నారు. సమంత నటించిన ఓ బేబి లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎంతో సర్ ప్రైజింగ్ గా ఉంటుందట.
ఆల్మోస్ట్ కెరీర్ రీలాంచ్ తర్వాత ఇంత బిజీగా ఉన్న వేరొక స్టార్ లేనేలేరంటే అతిశయోక్తి కాదు. ఓబేబి చిత్రంలో సమంత 60 ప్లస్ భామ్మగా కనిపిస్తుంటే.. రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న పాత్ర ఏది? అంటే ఆయనే సమాధానమిచ్చారు. నిన్నటిరోజున ఓబేబి ప్రీరిలీజ్ వేడుకలో డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ``అహనా పెళ్లంట` తర్వాత నేనింత వరకు సురేష్ ప్రొడక్షన్స్ లో నటించలేదు. ఇన్నాళ్టికి `ఓ బేబీ` చేశాను. `అహనా పెళ్లంట` టాలీవుడ్ బెస్ట్ మూవీ. బహుశా అంతకన్నా మంచి కథ దొరక్కనే నేను ఇప్పటిదాకా చేయలేదు. అంత మంచి పాత్రను `ఓబేబీ`లో చేశాను. ఒక మంచి సినిమా రావడానికి ఎవరు కారణమో అందరికీ తెలుసు. సినిమా ఇంత బాగా అందరి ముందూ ఉందంటే సమంత- నందిని కారణం. ఈ చిత్రంలో నేను చంటి అనే పాత్ర చేశా. లక్ష్మిగారికి - సమంతకు నేనే బోయ్ ఫ్రెండ్. ఇదొక అద్భుతమైన చిత్రం`` అని తెలిపారు.
ఫిలిం ఇనిస్టిట్యూట్ ఆర్టిస్టును. 42ఏళ్ల తర్వాత ఇనిస్టిట్యూట్ సిస్టమ్ లో నటించాను. ఓ హాలీవుడ్ సినిమాలో నటించిన ఫీలింగ్ కలిగిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఓబేబి చూశాక.. సినిమాలు చూసేవారికి నేను గుండెల్లో ఉంటా. ఒక సీన్‌లో సమంత నన్ను జుట్టు పట్టుకుని తన్నుతుంది. మరోసారి గుండెలు పిండేసేలా ఉంటుంది. ఆ సీన్ పండకపోతే నేను మళ్లీ సినిమాల్లో కనిపించను. నటుడిగా నాకు చాలెంజ్ ఇది .. అని తెలిపారు.