ప్యారెలల్ సినిమా.. ఎందుకు లేదు?

Update: 2017-12-24 04:32 GMT
గత కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా ఆంద్రప్రదేశ్ ప్రకటించిన నందుల వివాదం ఏ స్థాయిలో చెలరేగిందో అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రముఖ నటి నటులు ప్రతి ఒక్కరు స్పందించారు. ఎవరికి వారు తోచినట్టుగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. సైలెంట్ గా ఉండే దర్శక నిర్మాతలు కూడా మీడియా ముందుకు వచ్చి సైకిల్ అవార్డ్స్ అంటూ ప్రభుత్వంపై సెటైర్స్ వేశారు. అయితే రోజులు గడిచే కొద్దీ మెల్లగా అందరు ఆ వివాదాన్ని మరచిపోయారు.

అయితే చాలా రోజుల తరువాత మళ్లీ ఆ విషయంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్ స్పందించారు. అయితే ఆయన అవార్డ్స్ గురించి ఎక్కువగా స్పందించలేదు గాని తెలుగులో ప్యారెలల్ సినిమాల గురించి కొందరు అవార్డ్స్ ఇచ్చే సమయంలో నెగిటివ్ కామెంట్ చేయడంపై స్పందించారు. రీసెంట్ గా బేవర్స్ అనే సినిమాకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పేరు  చెప్పకుండానే విమర్శలు చేసిన వారిపై రాజేంద్రప్రసాద్ సెటైర్లు వేశారు.

ఆయన మాట్లాడుతూ..  ''మరాఠీ మలయాళీ సినిమాల్లో ఎక్కువగా ప్యారెలల్ సినిమాలు ఉంటాయి తెలుగులో ఎక్కువగా ఆ విధంగా ఉండవు అని కొందరు అన్నారు. అంతే కాకుండా మోహన్ లాల్ మమ్ముట్టీ వంటి వారు మాత్రమే అలాంటి సినిమాల్లో పాత్రలు చేయడానికి ఇష్టపడతారు అని అన్నారు. వారికి నేను ఒకటే చెబుతున్నా.. తెలుగులో కూడా కొత్త తరహా కథలు చాలా వచ్చాయి. ఎన్టీఆర్ - ఏఎన్నార్ వంటి వారు చాలా చేశారు. నేను కూడా ఆ నలుగురు - మీ శ్రేయభిలాషి వంటి మంచి సినిమాలు చేసి నందులను సొంతం చేసుకున్నాను'' అని తెలిపారు.


Tags:    

Similar News