తమిళనాడులో ఎన్నికల హడావుడి సాగుతోంది కాబట్టి ఆలస్యమవుతోంది కానీ... లేకపోతే ఈపాటికే రజనీ మేనియాతో సమ్మర్ మరింతగా హీటెక్కిపోయేది. రజనీకాంత్ నటించిన కబాలి చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. విడుదలకి కూడా సిద్ధమైంది. ఎన్నికల తర్వాత సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకొన్నారు. అలాగని సమ్మర్లో రజనీకాంత్ హడావుడి లేకపోతే ఏం బావుంటుంది? అందుకే టీజర్ ని సిద్ధం చేశారు.
అరవై సెకన్ల నిడివి గల టీజర్ ని మే 1న విడుదల చేయబోతున్నారు. మేడేని పురస్కరించుకొని ఆ టీజర్ విడుదల కాబోతోంది. అరవై సెకన్లలో రజనీ చేసిన మాయ ఎలా వుంటుందో చూడాలని అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఓ గ్యాంగ్ స్టర్ కథతో రూపొందిన చిత్రమిది. రజనీకాంత్ మాఫియా లీడర్ గా కనిపించబోతున్నాడు. సినిమాలో ఆయన లుక్కు, నేపథ్యం చాలా డిఫరెంట్ గా వున్నాయి. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచే పోస్టర్లని విడుదల చేస్తున్నారు. ఆ పోస్టర్లన్నీ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతూ వచ్చాయి.
ఇప్పుడు టీజర్ విడుదల కాబోతోంది. అదెలా వుంటుందో అని అభిమానులు ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్ కి చాలా ముఖ్యమైన సినిమా ఇది. చివరిగా ఆయన నటించిన రెండు చిత్రాలు సరైన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. అందుకే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చి మరీ సినిమా చేశాడు రజనీ. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే నటించింది.