అంతన్నారు ఇంతన్నారు మరి సైలెంటయ్యారు

Update: 2019-01-02 09:31 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 విడుదలైనప్పుడు జరిగిన పబ్లిసిటీ రచ్చ మాములుగా లేదు. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయని ఇలాంటి అద్భుతం మళ్ళి చూడలేదని ప్రచారం ఒకవైపు ఏకంగా లైకా సంస్థ అధికారికంగా వందల కోట్లు మంచి నీళ్లలా వస్తున్నాయని పోస్టర్లు మరోవైపు ఓ రెండు వారాలు హంగామా చేసారు. తీరా చూస్తే సరిగ్గా మూడు వారం గడవగానే ఎక్కడి దొంగలు అక్కడ గప్ చుప్. దీనికి ధీటైన సినిమా ఏది తర్వాత విడుదల కాకపోయినా 2.0 రిలీజ్ టైంలో ఇచ్చిన బిల్డప్ తర్వాత చల్లబడుతూ పోయింది. ఫైనల్ గా లాస్ వెంచర్ గా మిగలక తప్పలేదు.

తమిళ్ కంటే తెలుగు వెర్షన్ బెటర్ గా వసూళ్లు రాబట్టడం గమనించాల్సిన అంశం. ఎమోషన్ లేకుండా కేవలం గ్రాఫిక్స్ తో కథను నడిపించిన తీరు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ రోజులు నిలిచేలా చేయలేకపోయింది. తెలుగులో 50 కోట్ల షేర్ దాటలేక మొత్తం ఇరవై కోట్లకు పైగా నికర నష్టాన్ని మిగిల్చింది. ఇప్ప్పుడు దీని ప్రభావం పేట పై పడినట్టుగానే కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ గతంలో ఏ రజని సినిమా పలకలేనంత తక్కువగా వల్లభనేని అశోక్ పట్టేసుకున్నారని ఇప్పటికే టాక్ ఉంది. తమిళ్ లోసైతం ఎంత క్రేజ్ ఉన్నా గత అనుభవాల దృష్ట్యా రీజనబుల్ రేట్లకె బయ్యర్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారని వినికిడి.

రిపోర్ట్స్ బాగుంటే పేట ఈజీగా పెట్టుబడిని వెనక్కు ఇస్తాడు. ఏ మాత్రం తేడా వచ్చినా భీకరమైన పోటీ మధ్య అప్పడం కావడం ఖాయం. తమిళనాడులో విశ్వాసం తెలుగు మూడు స్ట్రెయిట్ సినిమాల మెరుపు దాడి మధ్య పేటకు సరిపడా థియేటర్లు దొరకడం లేదు. భీభత్సం అనే మాట వినిపిస్తేనే పేట రికార్డులు నమోదవుతాయి. లేదా మళ్ళి మురుగదాస్ సినిమా వచ్చే దాకా ఎదురు చూడటమే
   



Full View

Tags:    

Similar News