ట్యాక్సీవాలా మళ్లీ పుంజుకున్నాడు

Update: 2018-12-03 04:44 GMT
రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే. అతి తక్కువ బడ్జెట్‌ తో రూపొందిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ కారణంగా దాదాపు నాలుగు రెట్ల లాభాలను తెచ్చి పెట్టడం ఖాయం అంటూ ఇప్పటికే తేలిపోయింది. విడుదలైన మొదటి రోజే సినిమా పెట్టిన పెట్టుబడిని రాబట్టి, బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించింది. రెండవ రోజు నుండే లాభాల బాట పట్టిన ట్యాక్సీవాలా రెండు వారాల పాటు జోరు కొనసాగించాడు. తాజాగా ‘2.ఓ’ చిత్రం రాకతో ట్యాక్సీవాలా వేగం తగ్గనుందని అంతా భావించారు.

అన్నట్లుగానే ‘2.ఓ’ రాకతో ట్యాక్సీవాలా చాలా థియేటర్ల నుండి తొలగించబడినది. అయితే 2.ఓ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా థియేటర్లు వెలవెల బోతున్నాయి. ఎక్కువగా ఈ చిత్రాన్ని 3డి వర్షన్‌ లో చూడాలని ప్రేక్షకులు ఆశ పడుతున్నారు. అందుకే 2డి థియేటర్లలో 2.ఓ కు పెద్దగా ఆక్యూపెన్సీ రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25 శాతం థియేటర్లలో ఇదే పరిస్థితి ఉంది. దాంతో ఆ థియేటర్లలో నేడు లేదా రేపటి నుండి మళ్లీ ట్యాక్సీవాలాను ప్రదర్శించేందుకు సిద్దం అవుతున్నారు.

ఇప్పటికి ట్యాక్సీవాలా ఉన్న ఏరియాల్లో, థియేటర్లలో మంచి షేర్‌ వస్తుంది. అందుకే 2.ఓ కంటే ట్యాక్సీవాలా బెటర్‌ అనే ఉద్దేశ్యంతో థియేటర్ల యాజమాన్యం ట్యాక్సీవాలాను మళ్లీ వేసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. దాంతో ఈ వారంలో కూడా విజయ్‌ దేవరకొండ ట్యాక్సీవాలా జోరు కొనసాగే అవకాశం ఉంది.
Tags:    

Similar News