‘2.0’ను చీప్ గా కట్టేబెట్టేశారా?

Update: 2017-06-14 13:24 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్.. స్టార్ డైరెక్టర్ శంకర్ ల మెగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘2.0’ చిత్రం హిందీ హక్కుల్ని గుంపగుత్తగా రూ.80 కోట్లకు అమ్మేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఓ సౌత్ ఇండియన్ సినిమా హిందీ హక్కులకు ఇంత రేటు పలకడం ఇదే తొలిసారి. ఇది రికార్డు. కాకపోతే ఇందుకు ‘2.0’ నిర్మాతలు ఇందుకు ఎగిరి గంతేయాల్సిన అవసరమైతే లేదని.. వాళ్లది తెలివి తక్కువ పని అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘బాహుబలి: ది కంక్లూజన్’ హిందీ వెర్షన్ మాత్రమే రూ.500 కోట్ల గ్రాస్.. రూ.250 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ‘బాహుబలి-2’ను మించకపోయినా.. దానికి దీటుగా వసూళ్లు సాధిస్తుందన్న అంచనాలు ‘2.0’ మీద ఉన్నాయి. రాజమౌళి సినిమా నార్త్ ఇండియాలో వసూళ్ల ప్రభంజనం సృష్టించడానికి కంటే ముందే.. అక్కడ సౌత్ సినిమాలకు మార్కెట్లు ఓపెన్ చేసిన ఘనత శంకర్-రజినీలదే. వాళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ అప్పట్లో మంచి వసూళ్లే రాబట్టింది.

ఇప్పుడు ‘బాహుబలి’ ఇచ్చిన ఊపులో ‘2.0’ను సరిగ్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ ఊహించని స్థాయిలో వసూళ్లు వస్తాయన్న అంచనాలున్నాయి. కరణ్ జోహార్ లాంటి వాడితో టై అప్ పెట్టుకుని సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుని ఉంటే కథ మరోలా ఉండేదంటున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు అనూహ్యమైన స్థాయిలో ఉండేవని.. తక్కువలో తక్కువ రూ.200 కోట్ల దాకా వర్కవుట్ అయ్యేదని.. అలాంటిది రూ.80 కోట్లకు హోల్ సేల్ గా అమ్మేయడం సరైన నిర్ణయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News