దేశవ్యాప్తంగా కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరొకొన్ని సినిమాలు మేకింగ్ దశలో ఉన్నాయి. నిజానికి షూటింగ్ అయిపోయి విడుదలకు నోచుకోని సినిమాల సంగతే ఇలా ఉంటే.. మరి అసలు షూటింగ్స్ మొదలు కాకుండా.. మొదలై మధ్యలో ఆగిన వాటి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగులకు నిబంధనలతో కూడిన అనుమతులు అమలు చేస్తుండటంతో మెల్లగా మేకర్స్ షూటింగ్స్ ప్రారంభించే ఆలోచన చేస్తున్నారు. అయితే ఇటీవల షూటింగ్స్ మొదలైన సినిమాల నటీనటులకు కరోనా సోకుతుండటంతో భయంతో మళ్లీ షూటింగ్స్ ఆపేసే పరిస్థితి నెలకొంది. అంతా భయంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
రిలీజ్ గురించి ఆలోచించే సినిమాలను పక్కన పెడితే.. త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుందని ప్రకటించిన సినిమాల సంగతేంటి అని అందరి లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. అది కూడా ఓ సూపర్ స్టార్ సినిమా అయితే ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఏర్పడుతుందో ఆలోచించండి. అలాంటి ఇద్దరు దిగ్గజ నటుల కాంబినేషన్లో భారీ సినిమా రానుందని వెయిట్ చేస్తున్న తరుణంలో ఇంతవరకు మళ్లీ ఆ సినిమా ఊసే లేదని వాపోతున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్.. ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శివ దర్శకత్వంలో అన్నాతే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనాలు నటిస్తుండగా.. ఈ సినిమాలో కీర్తిసురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది.
అయితే ఈ సినిమా తర్వాత రజినీకాంత్.. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమాను కమల్ ఏప్రిల్ లోనే ప్రారంభించాలని ప్లాన్ చేసాడు. కానీ లాక్ డౌన్ కారణం గా ఎక్కడికక్కడ షూటింగ్స్ నిలిచిపోయాయి. ఈ పరిస్థితులలో ఈ సినిమా ఆగిపోయిందంటూ నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ అవి కేవలం రూమర్స్ మాత్రమే అని సమాచారం. పరిస్థితులు చక్కబడిన తర్వాత నవంబర్ నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని కమల్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సినిమా విడుదల అవుతుందట.