ప్ర‌ధాని ప్ర‌మాణం.. ర‌జ‌నీ ముందే వెళ్లారు!

Update: 2019-05-30 15:24 GMT
లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు దేశ రాజ‌కీయాల్లో మెలో డ్రామా గురించి తెలిసిందే. దేశ‌ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని త‌మిళ‌నాడు ప్ర‌జ‌లంతా తూల‌నాడారు. ద‌క్షిణాదిన‌ రాజ‌కీయంగా పూర్తిగా మోదీని వ్య‌తిరేకించింది త‌మిళులే. ఆ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సైతం ప్ర‌జ‌ల‌కే అండ‌గా నిల‌వాల్సి వ‌చ్చింది. తొలి నుంచి కాషాయ పార్టీకి ర‌జ‌నీ అనుకూలురు అంటూ ప్ర‌చారం సాగినా.. ర‌జ‌నీ సొంత పార్టీ పెట్ట‌డంతో బోలెడంత మెలోడ్రామా న‌డిచింది. కానీ ఈ ఎన్నిక‌ల్లో ర‌జ‌నీ సైలెంట్ గా ఉండ‌గా.. క‌మ‌ల్ హాస‌న్ మాత్రం మోదీకి యాంటీగా ప్ర‌చారం సాగించారు.

అయితే ఇవేవీ ప‌ట్టించుకోకుండా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గెలుపు అనంత‌రం ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి అధికారికంగా పీఎంవో నుంచి ర‌జ‌నీకాంత్ - క‌మ‌ల్ హాస‌న్ ఇద్ద‌రికీ ఆహ్వానాలు పంపారు. సినిమావోళ్ల అండ‌.. భ‌విష్య‌త్ త‌మిళ‌ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసే ఆ ఇద్ద‌రు లెజెండ‌రీ స్టార్ల అండ‌ త‌న‌కు కావాల‌ని సందేశం పంపారు మోదీ. అందుకేనేమో నిన్న‌టిరోజున సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మోదీ పై మీడియా స‌మావేశంలో ప్ర‌శంస‌లు కురిపించారు. మోదీ గొప్ప ఛ‌రిష్మా ఉన్న నాయ‌కుడు అని పొగిడేశారు.

అదంతా అటుంచితే నేటి ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వెళ్లారు కానీ క‌మ‌ల్ హాస‌న్ మిస్స‌య్యారు. ర‌జ‌నీ కుటుంబ స‌మేతంగా ఈ కార్య‌క్ర‌మానికి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు - సెల్ఫీలు రివీల‌య్యాయి. ఆహ్వానాలు అందుకున్న వారి జాబితాలో.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్- విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్- కింగ్ ఖాన్ షారూక్- కంగ‌న ర‌నౌత్- సంజ‌య్ లీలా భ‌న్సాలీ- క‌ర‌ణ్ జోహార్ పేర్లు ప్ర‌ముకంగా వినిపించాయి. బిగ్ బి అమితాబ్- కింగ్ ఖాన్ షారూక్ వంటి వారికి పిలుపులు అందినా వాళ్లు ఈవెంట్ లో క‌నిపించ‌లేదు.

అయితే కొంద‌రు హాజ‌రు కాగ‌లిగినా కొంద‌రు డుమ్మా కొట్టారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్- కంగ‌న ర‌నౌత్- క‌ర‌ణ్ జోహార్- షాహిద్ క‌పూర్- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కార్య‌క్ర‌మంలో క‌నిపించారు. ఇత‌రులు కాస్తంత ఆల‌స్యంగా వ‌స్తారా అన్న‌ది చూడాలి. తాజాగా బ‌య‌ట‌కు రివీలైన సెల్ఫీలో ర‌జ‌నీ- కంగ‌న‌- రాకేష్ ఓం ప్ర‌కాష్ మెహ్రా- సిద్ధార్థ్ రాయ్ క‌పూర్- మ‌హావీర్ జైన్- అభిషేక్ క‌పూర్ ఉన్నారు. అలాగే రివీలైన గ్రూప్ ఫోటోలో ర‌జ‌నీకాంత్ వైఫ్ ల‌త ర‌జ‌నీకాంత్ స‌హా షాహిద్ వైఫ్ మీరా రాజ్ పుత్ .. సుశాంత్ సింగ్.. ఆనంద్ ఎల్.రాయ్.. రాజ్ కుమార్ హిరాణి త‌దిత‌రులు క‌నిపించారు. పారిశ్రామిక వేత్త‌ల‌ నుంచి ర‌త‌న్ టాటా- ముఖేష్ అంబానీ కుటుంబాల‌కు ప్ర‌ధాని ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందింది.


Tags:    

Similar News