వినాయక చవితి సంధర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు సర్ప్రైజ్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ''అన్నాత్తే'' ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం ఈరోజు శుక్రవారం విడుదల చేసింది. రజినీకాంత్ హీరోగా మాస్ డైరెక్టర్ సిరుతై శివ తెరకెక్కిస్తున్న సినిమా 'అన్నాత్తే'. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాంప్రదాయ దుస్తులు ధరించిన రజినీ.. బ్లాక్ కళ్ళద్దాలతో స్టైలిష్ గా ఉన్నారు. టెంపర్ బ్యాక్ గ్రౌండ్ లో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ''అన్నాత్తే'' చిత్రంలో రజినీకాంత్ తో పాటుగా నయనతార - ఖుష్బూ - మీనా - కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - జగపతి బాబు - సూరి - సతీష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. డి. ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వెట్రి పలనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.
కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ''అన్నాత్తే'' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.