సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే ఆ సందడి వేరేలా ఉంటుంది. విడుదలకి నెల రోజుల నుంచే తమిళ జనాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ సారి ‘కాలా’ సినిమాతో రాబోతున్నాడు రజినీ. ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా జూన్ 7న రాబోతోంది.
అయితే ఈ సినిమాలో ఏది నిజమో... ఏది సిజీ సృష్టో తెలుసుకోవడం మాత్రం చాలా కష్టమని అంటున్నాడు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ చేసిన పీటే డ్రాపర్. మకుఠ యానిమేషన్స్ కో- ఫౌండర్ కమ్ సీఈవో అయిన డ్రాపర్ తెలుగులో ఈగ- మగధీర- బాహుబలి వంటి సినిమాలకి పనిచేశాడు. తమిళంలో గజినీ- ఇందిరన్ సినిమాలు చేశాడు. అయితే తానింతవరకూ చేసిన సినిమాల్లో కాలా కోసమే ఎక్కువ కష్టపడ్డామని చెబుతున్నాడు డ్రాపర్. ‘ఈ సినిమా కోసం ఒకన్నర కిలో మీటర్ల స్లమ్ సెట్ వేశారు. అందులో సీజీ వర్క్ చేయాలి. మీరు చూసే వాటిల్లో ఏది నిజమో... ఏది సీజీ సృష్టో తెలుసుకోవడం చాలా కష్టం...’ అంటున్నాడాయన.
కరికాలుడు అనే స్లమ్ డాన్ పాత్రలో రజినీ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఆయన భార్యగా ఈశ్వరీ రావు నటించగా బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ- నటుడు నానా పటేకర్ ముఖ్య పాత్రల్లో నటించారు.