ఈ సారి టాలీవుడ్ లో సినిమాల జాతర ముందే ఫిక్స్ అయిపోయింది. రంగస్థలం మూవీతో సమ్మర్ సీజన్ ను గ్రాండ్ గా ప్రారంభించాడు రామ్ చరణ్. ఆ తర్వాత వచ్చిన మీడియం బడ్జెట్ మూవీస్ డిజప్పాయింట్ చేసినా.. ఇప్పుడు రిలీజ్ అయిన భరత్ అనే నేను మాత్రం బ్యాంగ్ బ్యాంగ్ వసూళ్లను సాధించడం ఖాయం అయిపోయింది.
అయితే.. ఏప్రిల్ 27న రజినీకాంత్ మూవీ కాలాను రిలీజ్ కు షెడ్యూల్ చేయడంతో.. మహేష్ మూవీకి వారం రోజులే ఛాన్స్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సరైన కాలానికి రావడంపై.. కాలాపై ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. కోలీవుడ్ లో ఉన్న సమ్మె సిట్యుయేషన్ ఇందుకు కారణం. మార్చ్ నెల నుంచి విడుదల కావాల్సిన సినిమాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోలీవుడ్ డిసైడ్ చేయడం.. అందుకు అందరూ యాక్సెప్ట్ చేయడంతో.. కాలాకు వాయిదా వేసుకోక తప్పలేదు. కాలా కరికులన్ పేరుతో కబాలి దర్శకుడు పా రంజిత్ రూపొందించిన చిత్రాన్ని.. వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు.
జూన్ 7న కాలా విడుదల కానున్నట్లు కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. దీంతో మే 4వ తేదీన రానున్న అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య వచ్చేవరకూ.. మహేష్ సినిమాకు ఎదురు లేకుండా పోయింది. టాక్ పాజిటివ్ ఉండడంతో.. కలెక్షన్స్ కుమ్మేసుకోవడం ఖాయం అనుకోవచ్చు. సమ్మర్ హాలిడేస్ లో.. రెండు వారాల పాటు సోలోగా ఇరగదీసే ఛాన్స్ అంటే.. ఇప్పుడున్న రికార్డులు అన్నిటినీ సరిచేందుకు అవకాశం చిక్కడమే.