సూపర్ స్టార్ రజిని కాంత్ ని తెరపైన చూసి చాలా కాలమే అయింది. ఎప్పుడో 2016 లో కబాలి సినిమా లో కనిపించారు. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ గా '2 పాయింట్ ఓ' సినిమా చేస్తున్నాడు అని తెలియగానే ఫాన్స్ ఎగిరి గంతేశారు. కానీ ఆ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. కనీసం కాలా సినిమా అయినా విడుదల చేస్తున్నారా అంటే అది కూడా లేదని ఇప్పుడు కోలీవుడ్ కోడై కూస్తోంది.
మొన్నమొన్నటిదాక ఏప్రిల్ 27న కాలా సినిమా విడుదల ఖాయం అంటూ చెప్పుకొచ్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం కాలా సినిమా మరింత డిలే అవ్వచ్చని టాక్. సినిమా విడుదలను దర్శకనిర్మాతలు మే నెల వరకు పోస్టుపోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం తమిళ నిర్మాతలు చేస్తున్న నిరవధిక స్ట్రైక్. టి.ఎఫ్.పి.సి వారు.. స్ట్రైక్ వల్ల విడుదలకు నోచుకోని కొన్ని సినిమాలకోసం కాలా విడుదలను పోస్టుపోన్ చేయమని అడిగారట.. వాళ్ళ మాటను అంగీకరించి కాలా సినిమాను ఇప్పట్లో విడుదల చేయట్లేదని రూమర్లు వచ్చేశాయి.
ఈ మొత్త యవ్వారం టాలీవుడ్ లో చూసుకుంటే.. అసలు కాలా సినిమా 27న వస్తోంది కాబట్టే.. మహేష్ భరత్ అను నేను 20న అలాగే అల్లు అర్జున్ నా పేరు సూర్య మే 4వ తేదీకి పోస్టు పోన్ అయ్యాయ్. వారి డేట్లు మార్చుకున్నాక ఇప్పుడు కాలా మిస్సయితే.. కచ్చితంగా అది మహేష్ సినిమాకు ప్లస్సేమో కాని.. బన్నీకి మాత్రం పెద్దగా ప్లస్సేం కాదు. అందుకే కాలా డేటు తేడాపడితే మరోసారి టాలీవుడ్ లో కార్చిచ్చు రేగే ఛాన్సుందని ఇప్పుడు ఫిలిం నగర్లో పుకార్లు వినిపిస్తున్నాయి.
అయితే కబాలి ఫేం పా.రంజిత్ డైరక్షన్లో రూపందుతున్న ఈ 'కాలా' సినిమా పోస్టుపోన్ కావడంపై వస్తున్న రూమర్లలో నిజం లేదని 'లైకా ప్రొడక్షన్స్' ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. కాలా రిలీజ్ డేట్ గురించి అస్సలు మేం ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే రజనీ కార్చిర్చు రగల్చట్లేదని ఇప్పటికి అనుకోవచ్చు.