సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘కాలా’ను తమిళ.. తెలుగు భాషల్లో ఈ నెల 27న రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిర్మాత ధనుష్ ఆ దిశగా సన్నాహాలు చేసుకుంటుండగా ఉన్నట్లుండి సమ్మె వచ్చి పడింది. నెలన్నర పాటు సినిమాల విడుదలే లేకుండా పోయింది. ఎట్టకేలకు సమ్మె వీడి సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ‘కాలా’ ముందు అనుకున్నట్లే వచ్చే శుక్రవారం విడుదలవుతుందా లేదా అని కోలీవుడ్ జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న చిత్రాలు యధావిధిగా విడుదలవుతాయని.. ఈ నెలన్నరలో విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాల్ని వచ్చే రెండు నెలల్లో సర్దుబాటు చేస్తామని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ చెప్పాడు.
ఆ ప్రకారం చూస్తే ‘కాలా’ యధావిధిగా విడుదల కావాలి. ఈ శుక్రవారానికైతే ఏ కొత్త సినిమానూ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. వచ్చే వారానికి ‘కాలా’ను విడుదలకు సిద్ధం చేయగలరా అన్నది సందేహం. అలా చేయగలిగితే ఈ చిత్రానికి తిరుగులేని అడ్వాంటేజ్ ఉంటుంది. నెలన్నరగా కొత్త సినిమాల రుచి లేక అల్లాడిపోతున్న తమిళ జనాలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడతారు. కాకపోతే నెలన్నరగా సినిమాలకు సంబంధించి వేరే కార్యక్రమాలు కూడా ఆగిపోవడంతో ‘కాలా’ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిందా లేదా అన్నది సందేహం. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి సినిమాను మరో వారం రోజుల్లో రెడీ చేయగలగడం సవాలే. మరి ధనుష్ అండ్ కో ఇందులో విజయవంతమవుతుందేమో చూడాలి. ఈ రోజు సాయంత్రం నిర్మాతలందరం చర్చించి వచ్చే రెండు నెలల్లో ఏ సినిమా ఏ రోజు విడుదలవుతుందో ప్రకటన చేస్తామని విశాల్ తెలిపాడు. ఆ సమావేశంలో ధనుష్ కూడా పాల్గొనబోతున్నాడు. కాబట్టి ‘కాలా’ భవితవ్యం ఏంటన్నది ఈ రోజు రాత్రికి తేలిపోతుంది.