సూపర్ స్టార్ రజనికాంత్ కొత్త సినిమా' కాలా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని యు/ఎ తెచ్చుకుందని కోలీవుడ్ లో మహా జోరుగా ప్రచారం జరుగుతోంది. దాన్ని నిర్మాత ధనుష్ ధృవీకరించలేదు కాని నిజమే అని విశ్వసనీయ సమాచారం. నిజానికి సమ్మె విషయంలో కోలీవుడ్ లో పరిస్థితి తీవ్రంగా లేకపోతే ఏప్రిల్ 27 కాలా ఖచ్చితంగా విడుదల అయ్యేది. కాని ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు. షూటింగులతో సహా మొత్తం ఆపేసి కోలీవుడ్ మొత్తం నిరసన తీవ్రతరం చేసింది. కొత్త సినిమాల విడుదలలు ఆగిపోయి నెల దాటుతోంది. నిర్మాతలు ఇప్పటికే పెట్టుబడి మీద వడ్డీల భారం అంతకంతకు పెరుగుతున్నా లెక్క చేయకుండా ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్న తరహాలో ఉద్యమంలో భాగం అవుతున్నారు. దీంట్లో ప్రధాన భూమిక పోషిస్తున్న విశాల్ అభిమన్యుడు సినిమా విడుదల కూడా ఇందువల్లే ఆగిపోయింది.
సో కాలా కన్నా ముందే కాచుకుని ఉన్న సినిమాలు సుమారు 15 దాకా ఉన్నాయని అరవ న్యూస్ ఛానల్స్ చెబుతున్నాయి. వాటిని కాదని రజనీకాంత్ కాలాకు దారి పరిచేందుకు మిగిలిన నిర్మాతలు సుముఖంగా లేరు. రజని సినిమా ఎప్పుడు విడుదల చేసినా ఓపెనింగ్స్ విషయంలో భయం అక్కర్లేదని కాని తాము ఇప్పటికే సగం వేసవిని కోల్పోయామని ఇంకా ఆలస్యం చేస్తే నష్టం పెరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న టైంలో సినిమా విడుదల రచ్చ చేసుకోవడం రజనీకాంత్ కు మేలు చేసేది కాదు. అందుకే జూన్ 12 వాయిదా పడే అవకాశాలు నూటికి తొంభై శాతం ఉన్నాయి.
అదే కనక జరిగితే 20న వస్తున్న భరత్ అనే నేనుకు మే 4 విడుదల అయ్యే నా పేరు సూర్యకు కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం పూర్తిగా పోతుంది. ఎంత తమిళ డబ్బింగ్ అయినా రజనికాంత్ కు ఇక్కడ కూడా భారీ ఫాలోయింగ్ ఉంది కనక ముందు చెప్పిన టైంకు వస్తే ప్రభావం ఉండేది. జూన్ 12 కాలా వస్తే ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చని మహేష్ బన్నీ ఫాన్స్ రిలాక్స్ అవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ మరో రెండు మూడు రోజుల్లో రావొచ్చు.