కాలా శాటిలైట్ అదిరిపోలా

Update: 2018-03-19 05:42 GMT
కాలా కౌంట్ డౌన్ మొదలు పెట్టాడు. తన గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ ను శాసించే సూపర్ స్టార్ రజనికాంత్ ఊచకోత మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి కాలా శాటిలైట్ హక్కులు స్టార్ గ్రూప్ తెలుగు - తమిళ్ - హింది మూడు బాషలకు కలిపి హోల్ సేల్ గా 75 కోట్లకు కొనేసింది అనే వార్త ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. అందులో నటించిన పారితోషికాలు లెక్క వేయకుండా చూసుకుంటే సినిమా బడ్జెట్ కూడా అంత అయ్యుండదు.  వండర్ బార్ బ్యానర్ పై దీన్ని నిర్మిస్తున్న అల్లుడు ధనుష్ కు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అఫీషియల్ గా దీని గురించే ఇప్పుడే తెలిసే ఛాన్స్ లేదు కాని ఒప్పందం జరగడం గురించి విశ్వసనీయ సమాచారమే ఉంది. ఈ లెక్కన లింగా, కబాలి ఎఫెక్ట్ కాలా మీద ఏ మాత్రం పడే అవకాశం లేదని తెలిసిపోతోంది.

ఏప్రిల్ 27 విడుదల ప్లాన్ చేసిన కాలా ఇంకా సెన్సార్ కు వెళ్ళాల్సి ఉంది. అక్కడ నిరవధిక సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా షూటింగ్ లతో పాటు ఫైనల్ కాపీ రెడీ అయిన సినిమాలు కూడా ల్యాబ్ లోనే ఆగిపోయాయి. ఇది త్వరగా ముగిసిపోతే కాలా వెంటనే క్లియరెన్స్ కు వెళ్తుంది. ఒకవేళ ఆలస్యం అయితే మాత్రం విడుదల మరో వారం లేదా రెండు వారాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. పైగా ట్రైలర్ రిలీజ్ - ఆడియో ఫంక్షన్ చేయాల్సి ఉంది. మరోవైపు హిమాలయాల నుంచి నేరుగా అమెరికాకు హెల్త్ చెక్ కోసం వెళ్ళిన రజని తిరిగి వచ్చాక కాలా వేడుకలకు ప్లాన్ చేయాల్సి ఉంది.

రంజిత్ పా దర్శకత్వం వహించిన ఈ మూవీపై అభిమానుల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కబాలి పరాజయం తాలుకు ఛాయలు వెంటాడుతున్నప్పటికి ఇది ఖచ్చితంగా ఫాన్స్ మెచ్చేలా తీసానంటున్న రంజిత్ పా మాటలు ఎంత వరకు నిజమో మరో 40 రోజుల్లో తేలనుంది. కాలా తర్వాత తక్కువ వ్యవధిలోనే 2.0 వచ్చే అవకాశాలు ఉన్నాయి.  రెండు తలైవా సినిమాలు ఒకే ఏడాది రావడం పట్ల ఫాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు .
Tags:    

Similar News