కాలా టీజర్ వస్తోంది.. కాచుకోండి

Update: 2018-02-20 11:38 GMT
సూపర్ స్టార్ రజిని కాంత్ కి ఉన్న క్రేజ్ - ఫ్యాన్ ఫాలోయింగ్ సౌత్ లో మారే హీరో కి ఉండకపోవచ్చు. ఆయన ఒక సెన్సేషన్. అలాంటి హీరో ని దైవంగా ఆరాధించే ఫాన్స్ అంతా ఎప్పుడా అని ఎదురు చూసే రోజు రానే వచ్చింది. కొంపతీసి కాలా టీజర్ విడుదల అయిపోయిందా అనుకుంటున్నారా? ఇంకా లేదు లెండి. కానీ టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పేశారు.

రజిని కాంత్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి 2 పాయింట్ ఓ అయితే ఇంకొకటి కాలా.  2 పాయింట్ ఓ ను ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారో డైరెక్టర్ శంకర్ కే తెలియాలి. ఇంక మిగిలింది కాలా. ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేస్తాం అని ఇప్పటికే చెప్పేసారు. ఇప్పుడు ఈ సినిమా తాలూకు టీజర్ ను మార్చి 10న విడుదల చేయడానికి టీం రెడీగా ఉందట. యూనిట్ సభ్యులు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా అంతా ముంబై బాక్ డ్రాప్ లో నడవబోతుండగా - ఇందులో నానా పాటేకర్ - ఈశ్వరి రావు - హ్యూమా ఖురేషీ - అంజలి పాటిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్ ఈ సినిమాను తన వందర్బార్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను పొందు పరుచుకుంది. బోలెడు అంచనాల మధ్య ఈ సినిమా తెలుగు - హిందీ - తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Tags:    

Similar News