సూపర్ స్టార్ రజనీ కాంత్.. ఈ పేరు వినగానే ఫ్యాన్స్ లో ఓరకమైన ఉత్సాహం పొంగుకొస్తుంది. వయసు పెరిగినా ఆయన స్టయిల్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికే ఏం మారలేదు. తమిళనాడు రేంజిలో కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ అభిమానులకేమో కొరత లేదు. అందుకే రజనీ సినిమాలు తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజవుతాయి.
రజనీ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం నిర్మాతలు పోటీలు పడేవారు. కోట్లకు కోట్లు అడ్వాన్సులిచ్చేవారు. కానీ ఇప్పుడు రజనీ హీరోగా లేటెస్ట్ గా వస్తున్న కాలా సినిమా కొనేందుకు ఇంతవరకు బయ్యర్లు ముందుకు రాలేదు. కబాలి తర్వాత పా రంజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి తెలుగులో ఇంతవరకు హైప్ కూడా అంతగా ఏమీ రాలేదు. దానికితోడు ఈమధ్య రజనీ సినిమాలు వరసపెట్టి నిర్మాతలను నిండా ముంచాయి. కబాలి సినిమాకు అతి కష్టంమీద కొన్ని ఏరియాల్లోనే పెట్టుబడులు వెనక్కు వచ్చాయి.
కాలా సినిమాకు రజనీ అల్లుడు.. కోలీవుడ్ హీరో ధనుష్ నిర్మాత. ఈ సినిమాకు అతడు చెబుతున్న డబ్బింగ్ రైట్స్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉందనే తెలుస్తోంది. అంత భారీ మొత్తం ఇచ్చి రైట్స్ కొన్నాక రోబో స్థాయిలో హిట్ కొడితేనే నిర్మాతకు డబ్బులు మిగులుతాయి. కానీ కాలాపై అంత రేంజ్ అంచనాలు ఏమీ లేవు. అందుకే ధనుష్ అడిగినంత ఇవ్వడానికి బయ్యర్లు ఇష్టపడటం లేదు. జూన్ 6న కాలా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా ధనుష్ ఏమన్నా దిగొస్తే బయ్యర్లు ముందుకు రావచ్చు.