సూపర్ స్టార్ రజనికాంత్ కబాలి తర్వాత మరోసారి కాలా రూపంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయనున్నాడు. విడుదలకు ఇంకా రెండు నెలల దాకా సమయం ఉన్నప్పటికీ నిర్మాత ధనుష్ మాత్రం ప్రమోషన్ త్వరగా మొదలు పెట్టే పనిలో ఉన్నాడు. దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. భారీ క్రేజ్ ఉన్నా రజని సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లు ఎంతైనా డబ్బు పెట్టడానికి సిద్ధంగా లేరు. గత మూడు సినిమాల అనుభవంతో తీవ్రంగా నష్టపోవడాన్ని వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. అందుకే చివరి నిమిషం దాకా నాన్చితే ఇబ్బందులు వస్తాయని గుర్తించి పబ్లిసిటీతో పాటు బిజినెస్ కూడా కానిస్తున్నాడు ధనుష్. తెలుగు వెర్షన్ ఇంకా అధికారికంగా ఎవరూ కొనలేదు. కోట్ చేసిన మొత్తం దాదాపు 40 కోట్లకు దగ్గరగా ఉండటంతో అంత సాహసం చేసేందుకు భయపడుతున్నారు. కబాలి తమిళ్ లో ఓపెనింగ్స్ ద్వారా చాలా మటుకు సేవ్ చేసింది. తెలుగులో మాత్రం సాయంత్రానికే తేడా కొట్టేసి దారుణంగా దెబ్బ తింది.
అందుకే 30 కోట్లకు ఓ రెండు అటు ఇటు అంతకు మించి పెట్టలేం అనే ప్రతిపాదన పెట్టారట మనవాళ్ళు. మరి వండర్ బార్ సంస్థ తరఫున ధనుష్ ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. రేపు టీజర్ విడుదల అయ్యాక అంచనాలు పెరుగుతాయని దాని తర్వాత ఇంకొంచెం ఎక్కువ మొత్తం రావోచ్చనే అంచనాలు ఉన్నాడు ధనుష్. కబాలి విషయంలో కూడా ఇలాగే ట్రైలర్ తో మోసం చేసారు కాబట్టి ట్రైలర్ ని బట్టి సినిమా కొనే సమస్యే లేదని తెలుగు నిర్మాతలు చెప్పినట్టు టాక్. మరో రెండు వారాల్లో ఇది ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పక్కా ముంబై మాఫియా డాన్ గా బాషా తర్వాత రజని నటిస్తున్న సినిమా ఇదే. కబాలి దర్శకుడు రంజిత్ పానే దీన్ని టేకప్ చేయటం ప్రభావం కొంత తగ్గడానికి కారణం.
ఇక ఇందులో రజని పాత్ర పేరు కాలా సేట్ అని ఉంటుందని టాక్. ఇందులో ఉన్న పాత్రలన్నీ కాలాను అదే పేరుతో పిలవడం బాషా రోజులను గుర్తు చేస్తుందని అందులో చేసినవారు అంటున్నారు. ఇలా పోస్టర్లు, ట్రైలర్ల తోనే హడావిడి చేస్తారా లేక కంటెంట్ తో కొడతారా ఏప్రిల్ 27 చూడాలి. రెండోది జరిగితే మాత్రం రజని రికార్డుల ఊచకోత గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కాకపోతే ముందు వారం భరత్ అనే నేను, తర్వాతి వారం నా పేరు సూర్యలతో కాలా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే చేయాలి.