భారీ అంచనాలతో ప్రేక్షకుల మందుకు వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు (గురువారం) ఉదయం నుంచి ఈ మూవీ సందడి మొదలైంది. అయితే.. ఈ సినిమా విడుదల విషయంలో కర్ణాటకలో వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. కావేరీ నదీ జలాల విషయంలో రజనీ తీరుపై మండిపడుతున్న కన్నడిగులు ఈ సినిమాను కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకుంటామని చెప్పిన వైనం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే కర్ణాటకలో కాలా విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఈ మూవీని ప్రదర్శించకుండా ఉండేందుకు కన్నడిగులు పెద్ద ఎత్తున కాలా థియేటర్ల వద్దకు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో కన్నడిగులు బృందాలుగా మారి.. కాలా మూవీ ప్రదర్శించే థియేటర్ల వద్దకు చేరుకున్నారు.
రజనీ మూవీని ప్రదర్శిస్తే ఒప్పుకోమని.. ఒకవేళ తమ మాట కాదని షో వేస్తే.. విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో.. థియేటర్ యాజమన్యాలు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. థియేటర్‌కు వచ్చిన రజనీ అభిమానులు తమ అభిమాన నటుడి మూవీని చూస్తామా? లేమా? అన్న టెన్షన్ కు గురి అవుతున్నారు. మొత్తంగా చూస్తే.. కర్ణాటకలో కాలా మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. తన సినిమా విడుదలను అడ్డుకోవద్దంటూ రజనీ స్వయంగా కన్నడిగులను అర్థించారు.
తన నివాసమైన పోయస్ గార్డెన్ లో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన రజనీకాంత్ తాను ఏ తప్పూ చేయలేదని.. తన సినిమాను చూడాలనుకునే వారిని అడ్డుకోవద్దంటూ అర్థించారు. కన్నడ భాషలో రజనీ చేసిన అప్పీల్ ను కన్నడిగులు పట్టించుకున్నట్లుగా లేదని చెప్పాలి.