క‌బాలి బిజినెస్‌... భ‌లే భ‌లే!

Update: 2016-03-09 07:30 GMT
బ‌డ్జెట్టు ఫెయిల్ అవుతుంటుందేమో కానీ... సినిమా మాత్రం ఫెయిల‌వ్వ‌ద‌ని ట్రేడ్ పండితులు చెబుతుంటారు. అది నిజంగా నిజ‌మే అనిపిస్తుంటుంది కొన్ని సినిమాల ఫైన‌ల్ రిజ‌ల్ట్‌ ని గ‌మ‌నించిన‌ప్పుడు. ఎంత త‌క్కువ బ‌డ్జ‌ట్టులో సినిమా తీస్తే అన్ని లాభాలుంటాయ‌ని కొన్ని సినిమాలు నిరూపిస్తుంటాయి. కొన్ని మాత్రం సినిమా బాగున్నప్ప‌టికీ కాస్ట్ ఫెయిల్యూర్స్‌ గా మిగిలిపోతుంటాయి. ర‌జ‌నీకాంత్ గ‌త చిత్రాల్నే తీసుకోండి. కోచ్చ‌డ‌యాన్ కోసం వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టారు. లింగ కోసం కూడా అంతే. కానీ అవేవీ మంచి రిజ‌ల్ట్‌ ని తీసుకు రాలేక‌పోయాయి. పైగా ర‌జ‌నీ మేనియాకి ఆ సినిమాలు అప‌ఖ్యాత‌ని తెచ్చిపెట్టాయి. 

ఆ అనుభ‌వాల దృష్ట్యా ర‌జ‌నీకాంత్ త‌న కొత్త చిత్రం క‌బాలిని తక్కువ బ‌డ్జెట్టులో తీయాల‌న్న కండిష‌న్ పెట్టాడు. ఆ మేర‌కు కేవ‌లం 70కోట్ల‌తో సినిమాని పూర్తి చేశార‌ట‌. ర‌జ‌నీకి ఇండియాలోనే కాకుండా... విదేశాల్లోనూ మంచి మార్కెట్టు ఉంది. క‌బాలి లుక్కుని చూసి - ఫ్లేవ‌ర్‌ ని అంచ‌నా వేసి  మార్కెట్ వ‌ర్గాలు క్రేజీగా సినిమాని కొనేశాయి. దీంతో ఇండియా వైడ్‌ గా ఇప్ప‌టికే 150కోట్ల బిజినెస్ జ‌రిగిపోయింద‌ట‌. అంటే స‌గానికి స‌గం లాభాలొచ్చేశాయ‌న్న‌మాట‌. ర‌జ‌నీకాంత్ గ‌త సినిమాల అనుభ‌వాల్ని దృష్టిలో ఉంచుకొని మ‌రీ ఎక్కువ రేటుకి అమ్మొద్ద‌ని నిర్మాత‌కి చెప్పాడ‌ట‌. దీంతో త‌క్కువ రేటుకి అమ్మిన‌ప్ప‌టికీ స‌గం లాభాలొచ్చేశాయ‌ట‌. విదేశాల్లోనూ ర‌జ‌నీకి మార్కెట్టుంది కాబట్టి అక్క‌డ్నుంచి కూడా క్రేజీ బిజినెస్ ఆఫ‌ర్లు రావొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే... గ‌త చిత్రాల విష‌యంలో బిజినెస్ ప‌రంగా ర‌జ‌నీపై  ప‌డ్డ మ‌చ్చ ఈ సినిమాతో తొల‌గిపోతుంద‌న్న‌మాట‌.
Tags:    

Similar News