సూపర్ స్టార్ రజినీకాంత్ పేట ఫలితం తెలుగులో తేడా కొట్టింది కానీ తమిళ్ లో బాగానే దూసుకుపోతోంది. రొటీన్ కథ అనే విమర్శల మధ్యే వంద కోట్ల క్లబ్ లోకి గర్వంగా అడుగు పెట్టింది. స్టార్ హీరో ఉంటే చాలు కంటెంట్ ఎంత యావరేజ్ గా ఉన్నా బ్రహ్మరధం పట్టే తమిళ తంబీలు పేటతో పాటు అజిత్ విశ్వాసంకు కూడా ఇదే ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఇలా పోటీ కాకుండా తెలుగులో సోలోగా వచ్చి ఉంటె కొంత బెటర్ గా ఉండేదేమో కానీ మొత్తానికి కేవలం 12 కోట్లకె హక్కులు అమ్ముడుపోయిన పేట ఆ మాత్రం కూడా రాబట్టలేక ఫెయిల్యూర్ గా మిగిలింది.
ఇక దీని తర్వాత రజనీకాంత్ మురుగదాస్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిపోయింది. హీరోయిన్ గా కీర్తి సురేష్ దాదాపు ఫిక్స్ అయినట్టే. కూతురి కంటే చిన్నవాళ్ళతో కలిసి నటించను అనే మాటను తూచ్ అనేలా ఉన్నాడు తలైవా. ఇది రజనీకాంత్ 166వ సినిమా. ఇప్పుడు దీనికి సంబంధించి మరో అప్ డేట్ లీక్ అయ్యింది. ఇందులో రజని పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడట. ఇందులో విశేషం ఏముంది అనుకోకండి. ఆయన వెండితెరపై ఆ గెటప్ లో కనపడి 27 ఏళ్ళు అయ్యింది. చివరిసారిగా 1992లో పాండియన్ అనే సినిమాలో పోలీస్ గా కనిపించాక మళ్ళీ ఆ వేషం వేయలేదు. ఇదే తెలుగులో సీక్రెట్ పోలీస్ గా తెలుగులో డబ్ అయ్యింది. పెద్దగా ఆడని ఆ మూవీ తర్వాత రజని పోలీస్ బ్యాక్ డ్రాప్ లో చేయలేదు.
మురుగదాస్ సినిమాలో ఇదే మెయిన్ హై లైట్ గా ఉంటుందని చెబుతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే హీరోను రాజకీయ నాయకుడిగా చూపకపోవడమే ఇందులో ప్రత్యేకతగా తెలిసింది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని కూడా పేట తరహాలో తక్కువ కాల్ షీట్స్ లో ఫినిష్ చేసి వేసవి కానుకగా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అభిమానులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్న రజని కనీసం దీంతో అయినా తెలుగులో గట్టి బోణీ కొడతాడేమో చూడాలి