సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించే సినిమాకి ఎలాంటి క్రేజు ఉంటుందో తెలిసిందే. అసలే 2.0 .. పేట్ట (పేట) చిత్రాలతో ఊపు మీద అందుకున్నాడు. 2.0 చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి రజనీ పేరు మార్మోగిపోయింది. అటుపై పేట లాంటి కమర్షియల్ హిట్ కొట్టడం ఉత్సాహం నింపింది. అందుకే రజనీ రెట్టించిన ఉత్సాహంతో తన కెరీర్ 167వ సినిమా దర్బార్ లో నటించేస్తున్నారు. మురుగదాస్ లాంటి జాతీయ ఉత్తమ దర్శకుడి నిర్ధేశనంలో ఈ సినిమా ముంబైలో మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
నిన్నటిరోజున దర్బార్ టైటిల్ ని ప్రకటించగానే అభిమానులు సహా అన్ని వర్గాల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ట్రేడ్ లోనూ ఈ టైటిల్ పై ఆసక్తికర చర్చ సాగింది. కాలా - కబాలి ఫస్ట్ లుక్ కి వచ్చినంత స్పందన వచ్చింది. రజనీ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో పోలీసాఫీసర్ లుక్ ని ఫస్ట్ లుక్ లో రివీల్ చేశారు. లుక్ ఫెంటాస్టిక్ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అంతే వేగంగానూ దూసుకెళుతోంది.
అయితే ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు తాజాగా అంతర్జాలంలోకి వచ్చాయి. ఈ ప్రారంభోత్సవంలో రజనీ డ్రెస్ కోడ్ ఆసక్తి రేకెత్తించింది. ఆయన పూర్తిగా బాబాలు ధరించే రెడ్ కలర్ లాల్చీ తరహా డ్రెస్ తొడుక్కున్నారు. మెడలో నిండుగా పూలదండను వేశారు. ఇక ఆయనతో పాటు దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ ఇంచుమించు అదే తరహా తెల్ల రంగు డ్రెస్ ని ధరించారు. మెడలో పూలదండను అలంకరించుకున్నారు. ఆ తలకు చుట్టిన తలపాగా సాంప్రదాయాన్ని ఆవిష్కరించింది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు ఓ ఆసక్తికర పాత్రను పోషించనున్నారు. అనిరుధ్ రామచంద్రన్ సంగీతం అందించనున్నారు. 2.0 చిత్రాన్ని నిర్మించిన లైకా సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించనుంది. 2020 పెద్ద పండక్కి రిలీజ్ చేయాలన్న ప్లాన్ మేకర్స్ లో ఉందని తెలుస్తోంది.