హీరో అంటే అందంగా ఉండాలి. మంచి రంగుండాలి. ఒడ్డూ పొడవూ బాగుండాలి. మంచి ఫిజిక్ ఉండాలి. రజినీకాంత్ కు ఇవేవీ లేవు. కానీ ఆయనంటే పడి చచ్చే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. ఐతే తమిళనాట ఎంతమంది అభిమానులున్నా విశేషమేమీ కాదు. కానీ ఆయన కీర్తి రాష్ట్రాలు దాటింది, దేశాలు దాటింది, ఖండాలు కూడా దాటిపోయింది. జపాన్ - మలేషియా - సింగపూర్ లాంటి దేశాల్లో రజినీకాంత్ మీద అక్కడి జనాలకున్న అభిమానం చూస్తే మనకు పిచ్చెక్కడం ఖాయం. మలేషియా - సింగూపూర్ దేశాల్లో అయినా తమిళులు ఎక్కువ కాబట్టి రజినీ ప్రభావం ఉండటంలో ఆశ్చర్యం లేదు.
కానీ జపాన్ లో రజినీకి డైహార్డ్ ఫ్యాన్స్ ఉండటమే విచిత్రం. ‘ముత్తు’ సినిమాను అక్కడి వాళ్లకు ఎవరు పరిచయం చేశారో కానీ.. ఆ సినిమా చూసినప్పట్నుంచి రజినీ మాయలో పడిపోయారు జపాన్ జనాలు. రజినీ కొత్త సినిమా వస్తోందంటే చాలు.. మన ఫ్యాన్స్ కంటే కూడా అక్కడి అభిమానులే ఎక్కువ ఊగిపోతారు. థియేటర్ల దగ్గర సందడే వేరుగా ఉంటుంది. ఈ మధ్య రజినీ మీద అభిమానం మరీ శ్రుతి మించి పోయి అక్కడి దుకాణాల్లో సూపర్ స్టార్ విగ్రహాల్ని అమ్మకానికి పెట్టే స్థాయికి చేరింది. సూపర్ స్టైల్ తో ఉన్న రజినీ బొమ్మలు అక్కడ మంచి ధరకు అమ్ముడవుతుండటం విశేషం. జపాన్ లోని ఓ స్టోర్ లో కొలువుదీరిన రజినీ బొమ్మే పైన ఫొటోలో ఉన్నది. మన హీరోకు ఓ పరాయి దేశంలో ఈ స్థాయిలో క్రేజ్ ఉండటం నమ్మశక్యం కాని విషయమే.