మెగా దర్శకుడు శంకర్ ఉన్నాడు చూడండి.. ఆయన ఒక పాట కోసం ఏమైనా చేస్తాడు. గతంలో కూడా రోబో సినిమా పాటల కోసం ఆయన.. పెరూ దేశంలోని మచూ పిచూ అనే హెరిటేజ్ సైట్ కు వెళ్ళి.. అక్కడ షూటింగ్ చేశాడు. ఆ తరువాత బ్రెజిల్ అడవుల్లో 8 గంటల ప్రయాణం చేసి.. అడవి మధ్యలో ఉండే ఎడారి ప్రాంతంలో అందం మొత్తం నువ్వా అంటూ మరో పాటను షూట్ చేశారు. ఇప్పుడు సరైనోడు లొకేషన్ కూ వెళుతున్నారు.
అవును.. సరైనోడు సినిమా కోసం ఎంతో కష్టపడి బన్నీ అండ్ టీమ్ బొలీవియా లోని సాల్ట్ ఫ్లాట్ కు వెళ్లారు. అక్కడే తెలుసా తెలుసా అనే పాటను తీశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో శంకర్ కూడా రోబో 2.0 సినిమా కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ యామీ జాక్సన్ మీద ఒక రొమాంటిక్ సాంగ్ తీయబోతున్నారట. సరైనోడు సినిమా షూట్ చేయగానే.. ఆ లొకేషన్ గురించి తెలుసుకొని.. దాని ఫోటోలు చూసి.. శంకర్ ముగ్దమనోహరుడు అయ్యాడట. అందుకే తన యునిట్ ను బొలీవియా తీసుకెళుతున్నాడు.
ఇప్పటికే రోబో 2.0 సినిమా షూటింగ్ ను చాలా వారకు కంప్లీట్ చేసిన శంకర్.. బొలీవియాలో ఓ రెండు పాటలు షూట్ చేసి.. ఆ తరువాత మిగిలిన టాకీ పార్టు కంప్లీట్ చేస్తారట. ఇప్పటివరకు తీసిన సీన్లు తాలూక వి.ఎఫ్.ఎక్స్. వర్కు ప్రస్తుతం జరుగుతోంది.