రజనీ దగ్గర పవన్‌ ఇది నేర్చుకోవాలేమో

Update: 2016-07-21 11:30 GMT
''అత్తారింటికి దారేది'' సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయ్యాక.. డబ్బింగ్ ధియేటర్లో తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు చూడటమే కాని.. అసలు ఫైనల్‌ కాపీని రిలీజుకు ముందు ఒక్కసారి కూడా చూడలేదు పవన్ కళ్యాణ్‌. సినిమా రిలీజైన చాలా రోజుల తరువాత అత్తారింటికి దారేది సినిమా ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ ధియేటర్లో వేసుకొని చూశాడు ఈ టాప్‌ హీరో. ఇదే విషయంపై ఇప్పుడు పవన్ ఒక లెసన్ నేర్చుకోవాలి అంటున్నారు సినిమా లవర్స్.

గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న రజనీకాంత్‌.. అమెరికాలో ట్రీట్మెంట్‌ తీసుకొని రికవర్‌ అయ్యారనే రూమర్లు మనం చాలానే విన్నాం. దానికి తగ్గట్లే రజనీ కూడా నెల్లాళ్ళుగా కనిపించకుండా.. ఇప్పుడు ట్విట్టర్ లో కూతురు పెట్టిన ఫోటోలు ద్వారా మెరిశారు. ఇకపోతే ''కబాలి'' సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ కాబట్టి.. అమెరికాలో గత రాత్రి ఆయన సినిమాను ప్రివ్యూ వేసుకొని చూశారట. సినిమా పూర్తవ్వగానే దర్శకుడు పా.రంజిత్‌ కు ఫోన్‌ చేసి.. చాలాకాలం తరువాత నాకు పెద్ద హిట్టిస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పారట. అంతే కాకుండా ముద్దులు కూడా ఇచ్చారని ఆ దర్శకుడు చెప్పాడులే. ఒకవేళ సినిమా ఎక్కడన్నా స్లోగా అనిపిస్తే.. ఆ సీన్లు కత్తిరిద్దాం అనే ఆయన ముందే చూసుకున్నారట.

మరి పవన్ కూడా ఇలా తన సినిమాలను రిలీజుకు ముందు చూసుకుంటే.. వాటిలో ఏమన్నా చిన్నపాటి కరక్షన్లు చేయడం.. అక్కర్లేని స్లో సీన్లను కత్తిరించుకోవడం.. వంటివి చేసుకునే ఛాన్సుంటుంది. ఆ విషయం రజనీ దగ్గర నుండి పవన్‌ నేర్చుకోవాల్సిందే.

Tags:    

Similar News