విడుదలకు ముందు కానీ, తర్వాత కానీ.. తన సినిమాల గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోడు రజినీకాంత్. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల గురించి కూడా ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఐతే తొలిసారి ‘బాషా’ సినిమా గురించి ఓ ఫంక్షన్లో మనసు విప్పాడు సూపర్ స్టార్. తన కెరీర్ లో ‘బాషా’నే బెస్ట్ సినిమా అని.. దాన్ని మించిన సినిమా మరొకటి లేదని, రాబోదని కరాఖండిగా చెప్పేశాడు రజినీ. సూపర్ స్టార్ నటించబోయే తర్వాతి సినిమా ‘కబాలి’ కూడా మాఫియా బ్యాగ్రౌండ్ లో సాగబోతోంది. ఈ నేపథ్యంలో కబాలి ‘బాషా’లా ఉంటుందా అని చెన్నైలో బాషా నిర్మాత, మాజీ మంత్రి వీరప్పన్ 90వ పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన రజినీని విలేకరులు ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ‘‘ఇది 'బాషా'ను మించుతుందా అని అందరూ అడుగుతున్నారు. 'బాషా'ను మించే సినిమా మరొకటి లేదు. వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఎప్పటికీ ఒకే ఒక బాషానే. దానికి తిరుగులేదు’’ అని చెప్పాడు రజినీ. కబాలి ఎలా ఉండబోతోంది, ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదలవుతుందని అన్న ప్రశ్నలకు రజినీ జవాబివ్వలేదు. 90వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వీరప్పన్ గురించి మాట్లాడుతూ తాను ఆరోగ్యం విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ప్రస్తావించాడు రజినీ. ‘‘నాకు తెలిసి వీరప్పన్ ఇన్నేళ్లలో ఆసుపత్రికి వెళ్లిన సందర్భం లేదు. ఆసుపత్రిలో ఎదురయ్యే ఇబ్బందులన్నీ అనుభవించిన వ్యక్తిని నేను. అక్కడి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. దయచేసి అందరూ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 50 ఏళ్లు దాటాక ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాయామం చేయాలి'' అఅని రజినీ అన్నాడు.