మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల తొలి కలయికలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ `RRR`. రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ఐదు భాషల్లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రతీ స్టేట్ కి, ప్రతీ సిటీకి వెళ్లి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రచారం చేశారు.
దేశ వ్యాప్తంగా వున్న ప్రధాన నగరాల్లో ప్రత్యేకంగా పర్యటించి `RRR` కు కావాల్సిన క్రేజ్ ని రాబట్టారు. ఇప్పుడు ఇదే ఫార్ములాని బాలీవుడ్ మూవీ `బ్రహ్మాస్త్ర`కు ఉపయోగిస్తున్నారు రాజమౌళి. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణ్ బీర్ కపూర్, అలియాభట్, మౌనీరాయ్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ మూడు భాగాలుగా రూపొందించిన ఈ మూవీలోని ఫస్ట్ పార్ట్ శివ సెప్టెంబర్ 9న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
సకల అస్త్రాలకు దేవత బ్రహ్మాస్త్ర అంటూ మన పురాణాల్లోని ఓ కీలక అంశాన్ని ప్రధాన కథగా ఎంచుకుని ఈ మూవీని రూపొందించారు. దక్షిణాదిలో హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలోనూ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. దక్షిణాదిలో ఈ మూవీకి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కరణ్ జోహార్ తో కలిసి రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ నిర్మించిన ఈ మూవీ ఈ మూవీ కోసం రాజమౌళి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
దక్షిణాదిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా `బ్రహ్మాస్త్ర` టీమ్ తో కలిసి పర్యటిస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అంతే కాకుండా సెప్టెంబర్ 2న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేశారు. ఇది కూడా రాజమౌళి చేసిన ప్లానే. ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న విషయం తెలిసిందే. అది కూడా రాజమౌళి కోరడం వల్లే ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు వస్తున్నారన్నది అందిరికి తెలిసిందే.
ఈ నేఫథ్యంలో రాజమౌళి `బ్రహ్మాస్త్ర`కు ఇంతగా ఎందుకు ప్రచారం చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం రాజమౌళికి భారీ మొత్తం ఈ మూవీ నుంచి అందనుందని తెలిసింది. ఆ కారణంగానే దక్షిణాది వెర్షన్ కు సమర్పకుడిగా వ్యవహరించడమే కాకుండా రాజమౌళి `బ్రహ్మాస్త్ర` టీమ్ తో దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.