హీరోలు రియాక్ట్ అవుతారు కానీ వాళ్ళు కారే!

Update: 2017-03-17 07:51 GMT
ప్ర‌ముఖుల వైఖ‌రి కాస్త చిత్రంగా ఉంటుంది. అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారు.. ఎవ‌రైనా సాయం చేస్తే.. వారిని అభినందిస్తుంటారు. అది మంచి ప‌ద్ధ‌తే. కానీ.. తాము కూడా ఒక అడుగు ముందుకేసి.. మిగిలిన రాజ‌కీయ నాయ‌కుల‌కు స్ఫూర్తిగా ఎందుకు నిల‌వ‌రు? అన్న‌ది ఓ పెద్ద ప్ర‌శ్న‌.  ఏదైనా విప‌త్తు వ‌చ్చి ప‌డితే.. సినిమా సెల‌బ్రిటీలు సాయం ప్ర‌క‌టించ‌లేదే అని అంద‌రూ అనుకోవ‌టం క‌నిపిస్తుంటుంది. మ‌రి.. రాజ‌కీయ నాయ‌కులు సాయం ఎందుకు ప్ర‌కటించ‌ర‌న్న నిల‌దీత ఒక్క‌రంటే ఒక్క‌రూ చేయ‌రు.

 తాజాగా బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన అక్ష‌య్ కుమార్ ను అంద‌రూ అభినందిస్తున్నారు. అత‌ను స్పందించిన తీరుకు అత‌నికి ఫిదా అవుతున్నారు. అమ‌ర‌జ‌వాన్ల కుటుంబాల్ని ఆదుకోవ‌టం కోసం రూ.కోటి విరాళాన్ని ప్ర‌క‌టించ‌టం.. ఆయ‌నపై మ‌రింత అభిమానం పెరిగేలా చేస్తోంది.

అక్ష‌య్ కుమార్ ప్ర‌క‌టించిన విరాళం మీద కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. అమ‌ర‌జ‌వాన్ల కుటుంబాల‌కు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చిన అక్ష‌య్ పై ప్ర‌శంస‌లు జ‌ల్లు కురిపించారు. అక్ష‌య్ దాతృత్వం ఎంద‌రో జ‌వాన్ల కుటుంబాల‌కు సాయం చేస్తుంద‌ని.. జ‌వాన్ల కుటుంబాల‌కు సాయం చేయ‌టం ద్వారా ఆయ‌నో ప్రేర‌ణ‌గా నిలిచిన‌ట్లుగా చెప్పారు. ఇన్ని మాట‌లు చెప్పిన రాజ్ నాథ్‌.. త‌న వంతుగా  త‌నకు వ‌చ్చే జీతాన్ని అయినా ఇవ్వొచ్చుగా? రాజ్ నాథ్ లాంటి నేత నాలుగు రూపాయిలు జేబులో నుంచి తీయ‌టం దేశ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ప్రేర‌ణ క‌లిగించొచ్చుగా? రాజ్ నాథ్‌.. చంద్ర‌బాబు లాంటి వారి తీరు చూస్తుంటే.. పాల‌కులు కేవ‌లం మాట‌లు చెప్ప‌టానికే కానీ.. పైసా తీయ‌టానికి ముందుకు రారా? అనిపించ‌కమాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News