సూపర్ స్టార్ వాయిదా వేసేశాడు!!

Update: 2016-04-12 04:46 GMT
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కబాలి. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలిలో రాధికా ఆప్టే రజినీకి జంటగా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ దాదాపుగా పూర్తయిపోయినా.. తమిళనాట జరగనున్న ఎన్నికల కారణంగా అన్నీ వాయిదా పడుతున్నాయి.

నిజానికి ఏప్రిల్ 14నే కబాలి విడుదల కావాల్సి ఉండగా.. రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఎన్నికల తంతు పూర్తయ్యాక.. మే నెల చివర్లో రిలీజ్ చేస్తారని భావించారు. ఇప్పుడు ఆ టైంకి కూడా మూవీ రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. జూన్ రెండో వారానికి ఫస్ట్ కాపీ రెడీ అవదని అంటున్నారు. అందుకే ఈ టీజర్ రిలీజ్ వంటి కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కబాలి టీజర్ రిలీజ్ ను కూడా ఈ నెల మూడో వారానికి వాయిదా వేసేసింది యూనిట్. ప్రస్తుతం సెకండాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ పనులు చేస్తున్నామని ఎడిటర్‌ ప్రవీణ్‌ కె.ఎల్‌ చెప్పాడు. కబాలిలో రజనీకాంత్‌ ఇంట్రడక్షన్ సీన్.. ఈ మూవీలో హైలైట్ నిలుస్తుందనే టాక్ ఉంది.
Tags:    

Similar News