సెన్సార్ టాక్: గదిలో భయం, భావోద్వేగం

Update: 2017-10-07 11:05 GMT
హర్రర్ నేపథ్యంలో ప్రస్తుతం సినిమా కథలు బాగానే వస్తున్నాయి. మొన్నటి వరకు స్టార్ హీరోయిన్లు ఈ ప్రయోగాలు చేస్తే.. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ట్రై చేస్తున్నారు. కెరీర్ లో ఎన్నో వినూత్న సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి కొత్త ప్రయోగంతో రాబోతున్నాడు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజు గారి గది 2 సినిమా అక్టోబర్ 13న రిలీజ్ కాబోతోంది.

అయితే రీసెంట్ గా ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో హర్రర్ కథాంశంతో పాటు సెంటిమెంట్ కామెడీ కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాను చుసిన సెన్సార్ యూనిట్ సినిమాపై చాలా పాజిటవ్ గా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా సమంత నటన సినిమాను మారో స్థాయికి తీసుకువెళ్లడం ఖాయమట. అంతే కాకుండా ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ సీన్స్ తో అందరి నవ్వేలా ఉంటుందని తెలుస్తోంది. సెకండ్ ఆఫ్ లో ఎమోషన్ సీన్స్ ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తుందని ఒక ఆత్మ వేదన ప్రతి హృదయాన్ని కదిలించేలా ఉన్నాయట. గ్రాఫిక్స్ కూడా సినిమాలో చాలా బాగున్నాయని తెలుస్తోంది.

నాగ్ సినిమా చూశాక చాలా హ్యాపీగా ఫిల్ అయ్యారట. మొత్తానికి హడావుడి చూస్తుంటే సినిమా మాత్రం బాక్స్ రికార్డులు నమోదు చేయడం ఖాయమని అర్ధమవుతోంది. ముఖ్యంగా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనుకున్నట్టుగానే సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. మరి ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఏ స్థాయిలో రియాక్ట్ అవుతారో చూడాలి.  పివిపి సంస్థ మరియు మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో సీరత్ కపూర్ కూడా నటిస్తోంది.
Tags:    

Similar News