సల్మాన్ కి సెక్సిణి సపోర్ట్ వచ్చిందిగా!

Update: 2016-06-30 04:19 GMT
ఊరందరిదీ ఒక దారి.. ఉలిపికట్టెది మరొకదారి అనే సామెత ఉంటుంది. అలాగే బాలీవుడ్ అంతా ఒక రూట్ లో ఉంటే.. సెక్స్ బాంబ్ గా గుర్తింపు తెచ్చుకున్న రాఖీ సావంత్..  మరొక రూట్ ఎంచుకుంది. సల్మాన్ ఖాన్ చేసిన రేప్ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర మహిళా కమిషన్ నుంచి ప్రతీ ఒక్కరూ కండలవీరుడిని విమర్శిస్తున్నారు.

ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ కు అనుకోని విధంగా రాఖీ సావంత్ నుంచి సపోర్ట్ వచ్చింది. ఈమె వెర్షన్ ప్రకారం.. అసలు సల్మాన్ అలాంటి మాటలు అనే మనిషే కాదుట. 'మనుషులంతా తప్పు చేస్తారు కదా.. ఎవరికైనా నోరు జారుతుంది. ఆమాత్రం దానికే ఇంత హంగామా ఎందుకు' అంటూ మొదట మాట్లాడిన రాఖీ సావంత్ తర్వాత ప్లేట్ ఫిరాయించేసింది. అసలు సల్మాన్ అలాంటి మాటలు మాట్లాడడంటూ కొత్త పాఠం మొదలుపెట్టింది. ఈమె వెర్షన్ వింటే.. ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆ ఆడియో టేపుల్లో సల్మాన్ గొంతు మిమిక్రీ చేశారని అనేస్తోంది రాఖీ.

'నేనో విషయం గట్టిగా చెప్పగలను. సల్మాన్ అలాంటి మాటలు అసలు అననే అనడు. సల్మాన్ ది కేవలం లిప్ మూమెంట్స్ మాత్రమే. ఎవరో దానికి డబ్బింగ్ చెప్పారు. సల్మాన్ వాయిస్ తో మిమిక్రీలు చాలా ఉన్నాయ్ కదా. సల్మాన్ ని కావాలనే ఈ కాంట్రవర్సీలో ఇరికించారు. అయినా మోడీ సపోర్ట్ లభించాక ఎవరూ సల్మాన్ ని ట్రాప్ చేయలేరు' అంటూ ఏంటేంటో మాట్లాడేస్తోంది రాఖీ సావంత్.
Tags:    

Similar News