ఈ ఆదాయం పీఎం కేర్స్ కి ఇచ్చేస్తా..అంటున్న స్టార్ హీరోయిన్

Update: 2020-04-09 03:15 GMT
సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఎప్పటికప్పుడు ఫొటోలు - వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ కు మురిపించే రకుల్ యూట్యూబ్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఆ ఛానల్ కి వేల మంది సబ్‌ స్ర్కైబర్లు ఉన్నారు. ఇప్పటి వరకు తన ఫిట్‌ నెస్ - యోగా వీడియోలు మాత్రమే చేసిన రకుల్ తాజాగా వంటల ప్రోగ్రాం ప్రారంభించిందట. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ప్రకటించారు. ఈ ఛానెల్‌ లో వంటల వీడియోలు అప్‌ లోడ్ చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధాన మంత్రి నిధికి అందజేస్తానని రకుల్ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం (ఏప్రిల్ 7) ఈ వంటల కార్యక్రమానికి స్టార్ట్ చేసింది రకుల్. అందరూ తన యూట్యూబ్ ఛానెల్‌ ను సబ్‌ స్ర్కైబ్ చేసుకోవాలని కోరారు.

ఛానల్ లో మొదటి ప్రయత్నంగా చాక్లెట్ పాన్‌ కేక్‌ ను ఎలా తయారుచేయాలో చూపిస్తూ వీడియో చేసి యూట్యూబ్‌ లో అప్‌ లోడ్ చేసింది. ఇదిలా ఉంటే - తెలుగులో స్టార్ హీరోయిన్‌ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌ కు మకాం మార్చినట్టే అన్పిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదట. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయమైన రకుల్ ‘వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత నాగార్జున - రామ్ చరణ్ - ఎన్టీఆర్ - అల్లు అర్జున్ - మహేష్ బాబు - నాగచైతన్య - గోపీచంద్ - రామ్ ఇలా స్టార్ హీరోలందరితోనూ ఆమె నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చివరిగా చేసిన సినిమా ‘మన్మథుడు 2’. ఈ సినిమా తరవాత టాలీవుడ్‌ లో ఏ ప్రాజెక్ట్‌ ను అంగీకరించలేదు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 సినిమా చేస్తోంది.
   

Tags:    

Similar News